Botsa Satyanarayana: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ ప్రజలెవరూ చనిపోలేదు
ABN, First Publish Date - 2023-06-03T18:41:12+05:30
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఎవరూ
అమరావతి: ఒడిశా రైలు ప్రమాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఎవరూ చనిపోలేదని వెల్లడించారు. రైళ్ల ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారని తెలిపారు. ప్రమాద స్థలికి మంత్రి అమర్నాథ్తో పాటు అధికారులను పంపించినట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడూ వివరాలు సేకరిస్తున్నామన్నారు. ప్రమాదానికి గురైన రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించిన ప్యాసింజర్ల వివరాలన్నీ సేకరించినట్లు తెలిపారు. ఎవరూ చనిపోయినట్టు సమాచారం లేదు గానీ.. 40 మందికి గాయాలైనట్లు తెలుస్తోందన్నారు. ఏపీకి చెందిన క్షతగాత్రులకు ఒడిశాలోనే మంచి ఆస్పత్రుల్లో వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు బొత్స చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-06-03T18:41:12+05:30 IST