ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Secretariat Employees: సచివాలయ ఉద్యోగులు పరార్‌!

ABN, First Publish Date - 2023-05-24T03:41:33+05:30

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరారవుతున్నారు. ఉన్నత చదువులు చదివి... ఊళ్లో ఉద్యోగమని ఆశగా వచ్చిన యువతకు వైసీపీ సర్కారు చుక్కలు చూపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగం వదులుకున్న పది వేల మంది..

ఇతర రంగాల్లో అవకాశాలు చూసుకొని జంప్‌

ప్రొబేషన్‌ ప్రకటించిన తర్వాత కూడా అదే తీరు

ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం పేరిట సెలవుల్లోకి

పోటీ పరీక్షలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలంటూ దూరం

వేధింపులు, చీత్కారాలతో విసిగిపోతున్న సిబ్బంది

డిపార్ట్‌మెంటల్‌ టెస్టులు, బయోమెట్రిక్‌తో తిప్పలు

గౌరవ వేతనం తిరిగి ఇవ్వాలని సర్కారు నిబంధన

అప్పులు చేసి మరీ ప్రభుత్వానికి తిరిగి చెల్లింపులు

సిబ్బందికి వైసీపీ ప్రభుత్వం పట్ల విముఖత భావం

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభించినప్పటి నుంచి అందులో పనిచేసే ఉద్యోగులతో ప్రభుత్వం కుప్పిగంతులు వేయిస్తూనే ఉంది. దీంతో పలువురు ఉద్యోగులు ఇతర రంగాల్లో అవకాశాలు చూసుకొని ఈ ఉద్యోగానికి టాటా చెబుతున్నారు. రెండేళ్లకు పూర్తి చేయాల్సిన ప్రొబేషన్‌ను 8 నెలలు ఆలస్యంగా ప్రకటించడం, రూ.25 వేలకు మించకుండా జీతాలు ఇవ్వడంతో పాటు ఎన్నేళ్లు పనిచేసినా పదోన్నతి రాదన్న నిరాశతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చివరకు ఉద్యోగాలను వదులుకుంటున్నారు.

డీఎస్సీ ద్వారా నియామకమైన ఉద్యోగులకు కూడా ప్రొబేషన్‌కు డిపార్టుమెంటల్‌ టెస్ట్‌లు లేవు. టీచర్లు, నర్సు పోస్టులకు కూడా ఎక్కడా ఈ పరీక్షలు పెట్టలేదు.

ప్రత్యేకంగా సచివాలయ ఉద్యోగులు మాత్రమే పరీక్ష పాసవ్వాలని నిబంధనలు విధించారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరారవుతున్నారు. ఉన్నత చదువులు చదివి... ఊళ్లో ఉద్యోగమని ఆశగా వచ్చిన యువతకు వైసీపీ సర్కారు చుక్కలు చూపిస్తోంది. గ్రామ పంచాయతీల్లో కీలకమైన బాధ్యతలతో, భరోసా ఉన్న ఉద్యోగమని భావించిన వీరికి తీవ్ర నిరాశే మిగులుతోంది. కొంతమంది సిబ్బంది ఒత్తిడి తట్టుకోలేక ప్రొబేషన్‌ ప్రకటించిన తర్వాత కూడా ఉద్యోగం కాదనుకొని వెళ్లిపోతున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు వచ్చాయని కొందరు, పోటీ పరీక్షలు రాసేందుకు మరికొందరు, ఆరోగ్య కారణాలు చెబుతూ ఇంకొందరు కొలువు నుంచి పారిపోతున్నారు. సచివాలయ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వం అవలంబిస్తోన్నవైఖరితో ఉద్యోగులు విసిగి వేసారిపోయారు. ఏపీపీఎస్సీ ద్వారా ఐఏఎస్‌ తరహాలో పరీక్షలు నిర్వహించి రికార్డ్‌ అసిస్టెంట్‌ స్థాయి పోస్టులో నియమించారు. రెండేళ్లకు పూర్తి చేయాల్సిన ప్రొబేషన్‌ను 8నెలలు ఆలస్యంగా ప్రకటించారు. ఎన్నేళ్లు పనిచేసినా పదోన్నతి లేదన్న నిరాశతో చివరకు ఉద్యోగాలను వదులుకుంటున్నారు. ఈ విధంగా సుమారు 10శాతం మంది సచివాలయ సిబ్బంది ఉద్యోగాలు వదిలి వెళ్లారు. మొత్తం 1.34 లక్షల మందిని నియమిస్తే రాష్ట్రవ్యాప్తంగా 1.24లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలుస్తోంది.

ఆరంభం నుంచి ఆందోళనే

సచివాలయ వ్యవస్థ స్వరూపం ఏర్పడక ముందే ఉద్యోగులను ఎంపిక చేయడం, ఎంపిక చేసినవారికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం, ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు జాబ్‌చార్ట్‌ రూపొందించకపోవడం, జాబ్‌చార్ట్‌పై రోజుకో రకంగా ఉత్తర్వులు మార్చడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు. తొలుత సచివాలయ సిబ్బంది మొత్తం గ్రామ, వార్డు సెక్రటరీ సమన్వయంతో విధులు నిర్వహించాలని జాబ్‌చార్ట్‌ రూపొందించారు. ఆ తర్వాత వీఆర్వో ఆధ్వర్యంలో పనిచేయాలంటూ సవరించారు. ఆ ఉత్తర్వును కోర్టు రద్దు చేసింది. మొదట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ కార్యదర్శులందరూ పనిచేయాలని ఉత్తర్వులిచ్చారు. కానీ డిజిటల్‌ అసిస్టెంట్‌, పంచాయతీ కార్యదర్శి తప్ప మిగిలిన వారంతా ఆయా శాఖల మండల అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలు ఎందుకు పెట్టారో అర్థంకావడం లేదని పలువురు ఉద్యోగులే పేర్కొంటున్నారు. సచివాలయ వ్యవస్థను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం... వలంటీర్లకు ఇచ్చిన గౌరవం కూడా సచివాలయ ఉద్యోగులకు లేకుండా చేసిందని ఆరోపిస్తున్నారు. రికార్డింగ్‌ అసిస్టెంట్‌ స్థాయి పోస్టుకు గ్రూప్‌-1 స్థాయి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన ప్రభుత్వం వారి సేవలు వినియోగించుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వేధింపులు, చీదరింపులు....

గ్రామాల్లో ప్రజలకు నేరుగా సేవలందించే ఉద్యోగమనే ఉద్దేశంతో చేరిన విద్యావంతులైన యువతకు ప్రతినిత్యం వేధింపులు, చీదరింపులు తప్పడంలేదు. గ్రామానికి, వార్డులకు వచ్చిన ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు వీరిపై పెత్తనం చేసేవారు. ప్రజల వద్ద మెహర్బానీ కోసం సచివాలయ ఉద్యోగులను చీదరించుకోవడం, వేధించడం అలవాటైపోయింది. గ్రామ, వార్డు సచివాలయాలకు నిర్వహణ వ్యయం పైసా ఇవ్వకపోవడంతో ఆ బాధ్యతలు కూడా వీరిపైనే పడ్డాయి. ప్రజా ప్రతినిధుల విపరీత జోక్యంతో తాము సచివాలయ ఉద్యోగులుగా కాకుండా అధికార పార్టీ ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లుందని పలువురు సిబ్బంది భావిస్తున్నారు. ఉద్యోగాల్లో నియమించింది ఒక శాఖ అయితే జీతాలు ఇస్తున్నది మరోటి కాగా, అజమాయిషీ ఇంకో శాఖ చేస్తుండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మహిళా సంక్షేమశాఖ ద్వారా ఉద్యోగంలో చేరినా పోలీసు శాఖలో మహిళా పోలీసుగా పనిచేయడం ఇబ్బందిగా మారింది. అదేవిధంగా పలు శాఖలకు సంబంధించి సచివాలయ ఉద్యోగుల జాబ్‌చార్ట్‌ అస్పష్టంగా మారింది.

ఉన్నత చదువులు చదివి అరకొర జీతంతో పనిచేస్తూ ప్రజాప్రతినిధులు, అధికారుల చీదరింపులు భరించడం కంటే ఉద్యోగం వదిలేయడమే మేలన్న భావనకు పలువురు ఉద్యోగులొచ్చారు. కొంతమంది చెప్పాపెట్టకుండానే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేసుకుంటున్నారు. మరి కొంతమంది సెలవులు పెట్టి పరారయ్యారు. దీంతో సచివాలయాల్లో సుమారు 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ వైఖరితో లక్షకు పైగా ఉద్యోగాలిచ్చిన జగన్‌ సర్కార్‌పై సచివాలయ ఉద్యోగులకు కృతజ్ఞతా భావం లేకపోగా వ్యతిరేకత ఏర్పడిందంటున్నారు. అందుకే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.

అప్రెంటి్‌సషి్‌పతో ప్రారంభం

రెండేళ్ల పాటు అప్రెంటి్‌సషిప్‌ పేరుతో సచివాలయ ఉద్యోగులకు కేవలం రూ.15వేలు గౌరవ వేతనం అందించారు. ఏదో ఒక ఉద్యోగం వచ్చేవరకు దీనిలో కొనసాగుదామన్న ఉద్దేశంతోనే పలువురు రాత పరీక్షలు రాసి ఈ పోస్టులో చేరిపోయారు. తర్వాత మరో ఉద్యోగం రాగానే రిజైన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో అప్రెంటి్‌సషిప్‌ కాలంలో తీసుకున్న గౌరవ వేతనం తిరిగి ఇవ్వాలన్న నిబంధన విధించడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి తిరిగి చెల్లించారు. అప్రెంటి్‌సషిప్‌ పూర్తి కాకముందే తమను డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ రాయమనడంపై ఉద్యోగులు అప్పట్లో ఆందోళన చేశారు. పాస్‌ అయిన వారికే ప్రభుత్వం ప్రొబేషన్‌ ప్రకటించింది. సాధారణంగా డీఎస్సీ ద్వారా నియామకమైన ఏ ఉద్యోగులకూ డిపార్టుమెంటల్‌ టెస్ట్‌లు లేవు. టీచర్లు, నర్సు పోస్టులకు కూడా ఎక్కడా ఈ పరీక్షలు పెట్టలేదని, సచివాలయ ఉద్యోగులు మాత్రమే పరీక్ష పాసవ్వాలని నిబంధనలు విధించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

డిపార్ట్‌మెంటల్‌ టెస్టు పాసయితేనే రెగ్యులర్‌ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.... ఆ తర్వాత క్రెడిట్‌ బేస్డ్‌ అసె్‌సమెంట్‌ విధానాన్ని తెరపైకి తేవడం వారిని మరింత ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత బయోమెట్రిక్‌ హాజరు పేరిట ప్రతినిత్యం సచివాలయ ఉద్యోగులను కొంతకాలం హడలెత్తించారు. కొన్ని గ్రామాల్లోని సచివాలయాల్లో వారు ఎంచుకున్న నెట్‌వర్క్‌ పనిచేయకపోవడంతో బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగానే జీతాలివ్వాలన్న మెలిక వారిని అవస్థలకు గురిచేసింది.

Updated Date - 2023-05-24T06:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising