ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అరాచకాలకు అడ్డాగా పొన్నూరు

ABN, First Publish Date - 2023-06-16T01:03:50+05:30

వైసీపీ అరాచకాలకు అడ్డాగా పొన్నూరు నియోజకవర్గం మారిందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఆరోపించారు.

పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్న ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొన్నూరుటౌన్‌, జూన్‌ 15: వైసీపీ అరాచకాలకు అడ్డాగా పొన్నూరు నియోజకవర్గం మారిందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఆరోపించారు. ఇటీవల పచ్చలతాడిపర్రులో వైసీపీ నాయకులు పగులకొట్టిన టీడీపీ జెండా దిమ్మె సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని గురువారం పొన్నూరులో నిరసన ప్రదర్శన, ధర్నా జరిగింది. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి.., ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. వైసీపీ గూండాలను పోలీసులు కాపాడుతున్నారని నిరసించారు. ఐలెండ్‌ సెంటర్‌ నుంచి ప్రదర్శన రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ వరకు చేరుకుంది. ఈ క్రమంలో నరేంద్ర శ్రేణులతో కలిసి అకస్మాత్తుగా స్టేషన్‌ ఎదుట జీబీసీ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చలతాడిపర్రులో వైసీపీ నాయకుల అరాచకాలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరు సమీపంలోని గ్రామంలో సర్పంచ్‌ భర్త కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో దౌర్జన్యాలకు దిగినా పోలీసులు అక్కడకు చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టడం ఏమిటని ప్రశ్నించారు. కర్రలు, ఇనుపరాడ్లతో రెండు గంటలపాటు వీరవిహారం చేస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. పోలీసులు పక్షపాత ధోరణిని విడనాడాలని తెలిపారు. ఘటనపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన టీడీపీ నాయకులపై రూరల్‌ ఎస్‌ఐ భార్గవ్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనే వైసీపీ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నట్లుగా ఉందని ఆరోపించారు. ఘటనను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ మండల అధ్యక్షుడు బండ్లమూడి బాబురావును వైసీపీ సానుభూతిపరుడు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. బాబురావుపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా వదిలేయడం దారుణమన్నారు. పోలీసులు చోద్యం చూడడం వల్లే నియోజకవర్గంలో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయని దుయ్యబట్టారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాని హితవు పలికారు. అనంతరం డీఎస్పీ జనార్ధనరావును కలిసి ఫిర్యాదు అందజేశారు.

Updated Date - 2023-06-16T01:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising