ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపి....క నశిస్తోంది

ABN, First Publish Date - 2023-01-21T00:27:28+05:30

పేరుకు అది జిల్లా ఆస్పత్రి.. 230 పడకలతో జిల్లాలోనే రెండో పెద్దాస్పత్రి స్థాయి.. అయినా తెనాలి జిల్లా ఆస్పత్రిలో రోగులకు అవస్థలు తప్పడంలేదు.

మందుల కౌంటర్‌ వద్ద వృద్ధులు, పురుషులు, స్త్రీలు ఒకే లైన్లో వస్తున్న పరిస్థితి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి వైద్యశాల్లో రోగులకు తిప్పలు

పురుషులు, స్త్రీలకు వేరుగా లేని మందుల కౌంటర్లు

పేరుకు జిల్లా ఆస్పత్రి.. రోగులకు కనీస సౌకర్యాలు మృగ్యం

తెనాలి రూరల్‌, జనవరి 20: పేరుకు అది జిల్లా ఆస్పత్రి.. 230 పడకలతో జిల్లాలోనే రెండో పెద్దాస్పత్రి స్థాయి.. అయినా తెనాలి జిల్లా ఆస్పత్రిలో రోగులకు అవస్థలు తప్పడంలేదు. చికిత్సల మాట అటుంచి రోగులకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులేవు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఓపీలోనే నరకం కనిపిస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రి ప్రవేశ మార్గంలో ఉన్న ఓపీ కౌంటర్‌ ఇరుకుగా ఉంది. ఓపీకి వచ్చే వారు కేవలం 10-15 మంది మాత్రమే పట్టే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓపీ నమోదుకు వచ్చే రోగులు పలు సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. అయితే వారికి ఓపీ కేంద్రంలో పేర్ల నమోదుకే గంటలతరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కేవలం పురుషులు, స్త్రీలు, వయోవృద్ధులకు సంబంధించి మూడు కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయి. పేర్ల నమోదులో జాప్యం జరుగుతుండటంతో రోగులు అల్లాడిపోతున్నారు. ఇక తెలిసిన వారు, రికమండేషన్‌ ఉన్న వారి పేర్లను ముందుగా నమోదు చేస్తూ క్యూలో ఉన్న వారిపై సిబ్బంది నిర్లక్ష్యం చూపుతుండటంతో రోగుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఓపీ నమోదు తర్వాత వైద్య పరీక్షల అనంతరం మందుల కోసం మరింతగా పడిగాపులు కాయాల్సి వస్తోంది. మందులు తీసుకునేందుకు గంట వరకూ వేచి ఉండక తప్పదు. మందులు కౌంటర్‌ గతంలో వయోవృద్ధులకు, స్త్రీ, పురుషులకు వేరువేరుగా ఉండేవి. అయితే ప్రస్తుతం మందుల కౌంటర్‌ ఒకటే(స్త్రీ) ఉంది. అదే క్యూలైన్లో వృద్ధులు, స్త్రీలు, పురుషులు కూడా నిల్చొని మందులు తీసుకోవాల్సి వస్తోంది. మందులు ఇచ్చే గదిలో ఒకే మహిళా సిబ్బంది ఉండటం.. ఆమె డాక్టర్‌ చెప్పిన మందులు రోగులకు ఇచ్చి వాటిని ఎలా వాడాలో రోగులకు వివరించడంతో మరింత ఆలస్యం అవుతుంది. అసలే అనారోగ్యంతో ఉన్న రోగులకు ఇలాంటి సమస్యలతో మరింత ఇబ్బందులు పడుతున్నారు.

పని చేయని సిటీ స్కానర్‌..

ఆస్పత్రిలో కొన్నేళ్లుగా సిటీ స్కానర్‌ పనిచేయడంలేదు. అయినా దానికి మరమ్మతులు చేయించడం లేదా నూతన స్కానర్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టడంలేదు. దీంతో సిటీ స్కాన్‌ అవసరమైన రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. బయటకు వెళ్లిపరీక్షలు చేయించుకోవాలంటే దాదాపు వేయి రూపాలయలు పైనే వెచ్చించాల్సి వస్తుంది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాల్లో అనేక సమస్యలు ప్రస్తావిస్తున్నా అవి పరిష్కారానికి నోచుకోవడంలేదన్న విమర్శలున్నాయి. గతంలో జరిగిన కమిటీ సమావేశంలో పలు మార్లు సిటీస్కానర్‌ నూతనంగా తెప్పించి అందుబాటులోకి తెస్తామని చెప్పినా అది ఆచరణలో అమలుకాలేదు. పార్కీంగ్‌ ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్న మాటలు కూడా కార్యరూపం దాల్చలేదు.

Updated Date - 2023-01-21T00:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising