ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP MLA RK: రంగా పేదల కోసం జీవితం త్యాగం చేశారు

ABN, First Publish Date - 2023-07-04T16:54:36+05:30

వంగవీటి మోహనరంగా పేదల కోసం జీవితం త్యాగం చేశారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. పాతూరులో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే, వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు, జనసేన నుంచి చిల్లపల్లి శ్రీనివాసరావు, పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడారు. వంగవీటి మోహనరంగా పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. అటువంటి మహనీయులు అందరికీ ఆదర్శనీయం అని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వంగవీటి మోహనరంగా పేదల కోసం జీవితం త్యాగం చేశారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. పాతూరులో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే (YCP MLA RK), వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు, జనసేన నుంచి చిల్లపల్లి శ్రీనివాసరావు, పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడారు. వంగవీటి మోహనరంగా పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. అటువంటి మహనీయులు అందరికీ ఆదర్శనీయం అని తెలిపారు.

పోతిన వెంకట మహేష్..

వంగవీటి మోహనరంగా పేరు చెప్పకుండా రాజకీయాలు సాగవని జనసేన నేత పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యానించారు. ప్రతీ పార్టీలో నేతలు రంగా పేరు చెప్పుకుని పదవులు పొందుతున్నారన్నారు. రంగా వారసుడు రాధాకృష్ణతో కలిసి అందరూ నడవాలని తెలిపారు.

వైసీపీ నేత మురుగుడు హనుమంతరావు

రంగా విగ్రహావిష్కరణలో వైసీపీ నేత మురుగుడు హనుమంతరావు మాట్లాడారు. ‘‘నాడు మున్సిపల్ ఛైర్మన్‌గా రంగాతో కలిసి పని చేశాను. ఆయన పేరు చెబితే చాలు ఎటువంటి పని అయినా జరిగేది. ఒక్క పాలు మాత్రమే తాగేవారు.. ఎటువంటి దురాలవాటు లేదు. రౌడీగా ఆయన్ని చిత్రీకరించారు... కానీ రంగా అసామాన్యమైన వ్యక్తి. కేవలం పేదల కష్టాలు తీర్చాలనే ముందుకు సాగారు. చాలా నిరాడంబరంగా రంగా జీవితం సాగింది. నోరు తెరిస్తే కేవలం వాస్తవాన్ని ధైర్యంగా చెప్పేవారు. అటువంటి కుటుంబం ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటుంది. రంగా తనయుడు రాధాకృష్ణ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నారు. రంగా లాగే... ఏది ఉన్నా నేరుగా రాధా కూడా అభిప్రాయాలు చెబుతారు. ఈ ధరిత్రి ఉన్నంత కాలం రంగా పేరు ప్రస్తావన ఉంటూనే ఉంటుంది.‌’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-07-04T16:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising