ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో మూడు రోజుల పాటు ఎండ మంటలు మండిస్తుందట..

ABN, First Publish Date - 2023-06-06T08:02:48+05:30

రుతుపవనాలు ఆలస్యంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఎండ మంటలు మండిస్తుందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు అల్లూరి జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏలూరు జిల్లా కుకునూర్, వేలేరుపాడు మండలాలతో పాటు మరో 212 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : రుతుపవనాలు ఆలస్యంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఎండ మంటలు మండిస్తుందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు అల్లూరి జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏలూరు జిల్లా కుకునూర్, వేలేరుపాడు మండలాలతో పాటు మరో 212 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచనున్నాయి. వడగాల్పులు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

నిన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 43.3°C, ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1°C, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానుంది. నేడు అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Updated Date - 2023-06-06T08:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising