RJD Pratap Reddy: ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డిపై విచారణ
ABN, First Publish Date - 2023-02-17T02:39:37+05:30
ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, కడప ఇన్‌చార్జ్ ఆర్జేడీ బి.ప్రతా్‌పరెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేసి నివేదిక సమర్పించాలని కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖే్‌షకుమార్ మీనా ఆదేశాలు జారీచేశారు.
ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఆదేశం
అనంత విద్యాశాఖ సమావేశంలో ఆర్జేడీ ఆలింగనాలు, సెల్ఫీలు
ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, కడప ఇన్‌చార్జ్ ఆర్జేడీ బి.ప్రతా్‌పరెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేసి నివేదిక సమర్పించాలని కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖే్‌షకుమార్ మీనా ఆదేశాలు జారీచేశారు. టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, రాష్ర్టోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కడప ఇన్‌చార్జ్ ఆర్జేడీగా ప్రతా్‌పరెడ్డిని నియమించడం వివాదాస్పదంగా మారింది. కేవలం ఎన్నికల కోసమే ఆయన్ను ఇన్‌చార్జ్‌గా నియమించారన్న వాదన ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా ఇటీవల టీచర్లతో పలు రకాల పేర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయన భార్య ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి వైసీపీ మద్దతిస్తున్న అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారు.
ప్రత్యక్ష సహకారం: ఎస్టీయూ
వైసీపీ మద్దతిస్తున్న పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డికి ఆర్జేడీ పరోక్షంగానే కాకుండా ప్రత్యక్షంగా కూడా సహకారం అందిస్తున్నారని ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న ఆరోపించారు.అధికార పార్టీ అభ్యర్థికి ఓటేయకపోతే ఇబ్బందులు ఉంటాయని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రతా్‌పరెడ్డిని సస్పెండ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రమణారెడ్డికి మద్దతు: టీఎన్‌యూఎస్
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఎల్‌సీ రమణారెడ్డికి మద్ధతిస్తున్నట్లు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
Updated Date - 2023-02-17T02:39:38+05:30 IST