ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ISRO: మరో వాణిజ్య రంగ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధం

ABN, First Publish Date - 2023-03-21T21:27:47+05:30

మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమైంది. ఈనెల 26న తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని సతీష్‌ థావన్‌ స్పేస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సూళ్లూరుపేట: మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమైంది. ఈనెల 26న తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జరిగే ఈ రాకెట్‌ ప్రయోగం ద్వారా వన్‌వెబ్‌ ఇండియా-2 పేరుతో ఒకేసారి 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. రాకెట్‌ (Rocket) మూడు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తిచేసి ప్రయోగ వేదికపై సిద్ధం చేశారు.ఈ నెల 26న ఉదయం 9 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ (Countdown) 24 గంటలు ముందు నిర్వహించనున్నారు. కౌంట్‌డౌన్‌కు ముందు రాకెట్‌ రిహార్సల్‌, ప్రీ కౌంట్‌డౌను అదే రోజు నిర్వహించనున్నారు. వాణిజ్యపరంగా ఇస్రోలో అంతర్భాగంగా ఉన్న న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌తో కుదుర్చుకొన్న ఒప్పందంలో భాగంగా ఇస్రో ఈ వాణిజ్య రంగ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది.

Updated Date - 2023-03-21T21:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising