ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LokeshPadayatra: పసుపు జెండా దెబ్బకు జగన్‌కి జ్వరం: నారా లోకేశ్‌

ABN, First Publish Date - 2023-03-27T21:07:17+05:30

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పసుపు జెండా దెబ్బకు జగన్‌కి 104 జ్వరం పట్టుకుందని, ఇది టీడీపీ ఇచ్చిన షాక్‌ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పుట్టపర్తి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పసుపు జెండా దెబ్బకు జగన్‌కి 104 జ్వరం పట్టుకుందని, ఇది టీడీపీ ఇచ్చిన షాక్‌ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (NaraLokesh) అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో సోమవారం యువగళం పాదయాత్ర (YuvaGalam) 52వ రోజు జనసంద్రం నడుమ సాగింది. గోరంట్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేశ్‌ ప్రసంగించారు. ఇక వైసీపీ దుకాణం బంద్‌ అవ్వడం ఖాయమని, పసుపు దెబ్బకు వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయిందని అన్నారు. ఒకటి రాజారెడ్డి వర్గం, రెండోది అంబేడ్కర్‌ వర్గం అని అన్నారు. రాజారెడ్డి వర్గానికి అధ్యక్షుడు జగన్‌ (Jagan) అయితే, అంబేడ్కర్‌ వర్గానికి ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) అధ్యక్షురాలని తెలిపారు. అంబేడ్కర్‌ గారి బలం పెరుగుతోందని, రాజారెడ్డి బలం తగ్గుతోందన్నారు. జగన్‌ది చెత్త పరిపాలన అని తాను అనడం లేదని, వైసీపీ ఎమ్మెల్యేలే అంటున్నారని పేర్కొన్నారు. వైసీపీలో అక్రమాలు, అన్యాయాలు, అవినీతి గురించి ఆ పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారంటే.. జగన్‌ అరాచకాలను అర్థం చేసుకోవచ్చని చెప్పారు. బానిస సంకెళ్లు తెంచుకున్న డాక్టర్‌ సుధాకర్‌, అచ్చెన్నని చంపినట్లు తనను చంపాలని చూస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి అంటున్నారంటే.. వైసీపీ ప్రభుత్వం తీరు ఎలా ఉందో తెలుస్తోందని అన్నారు. వైసీపీలో 40 నుంచి 60 ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని లోకేశ్‌ తెలిపారు. వైసీపీలో ఎమ్మెల్యేలకు గౌరవమే లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు లోలోపల రగిలిపోతున్నారని అన్నారు.

దారి పొడవునా జనం..

పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్‌ సోమవారం 11.3 కి.మీ. పాదయాత్ర సాగించారు. 52వ రోజుకి మొత్తం 661.4 కి.మీ. పాదయాత్ర పూర్తి అయ్యింది. గోరంట్ల మండలంలోని రెడ్డిచెరువుకట్ట నుంచి గుమ్మయ్యగారిపల్లి క్రాస్‌ వరకూ సాగిన పాదయాత్రకు దారిపొడవునా జనం ఘన స్వాగతం పలికారు. పెనుకొండ నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. బహిరంగ సభ జరిగిన గోరంట్లలో వీధులు జనసంద్రంగా మారాయి. వడ్డెరలు, నాయీ బ్రాహ్మణులు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. పాదయాత్రలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రి పరిటాల సునీత సంఘీభావం తెలిపారు.

Updated Date - 2023-03-27T21:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising