ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ ఓడాలి... రాష్ట్రం గెలవాలిc

ABN, First Publish Date - 2023-07-01T03:06:06+05:30

నేనొకటే చెప్తున్నా... వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓడాలి, రాష్ట్రం గెలవాలి, సైకో పోవాలి, సైకిల్‌ రావాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

● ప్రతిపక్ష నేత చంద్రబాబు పిలుపు

● టీడీపీలో చేరిన కృష్ణా జిల్లా వైసీపీ నేత

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): ‘‘నేనొకటే చెప్తున్నా... వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓడాలి, రాష్ట్రం గెలవాలి, సైకో పోవాలి, సైకిల్‌ రావాలి. అప్పుడే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ప్రజలకు మంచి జరుగుతుంది. నేను నా కోసం కాదు... రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నా’’ అని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్‌ని, వైసీపీని ఓడించడానికి అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌ చంద్రబోస్‌, అతని అనుచరులు టీడీపీలో చేరారు. వారందరికీ పసుపు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘‘రాష్ట్రాన్ని తెలుగుదేశం తప్ప ఎవ్వరూ కాపాడలేరని పార్టీలోకి వచ్చిన వైసీపీ నేత సుభాష్‌ చంద్రబోస్‌ను అభినందిస్తున్నా. అతనితో పాటు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, ఇతర నేతలకు ఆహ్వానం. కరుడుకట్టిన నేరస్తుడిని నమ్మి సీఎంని చేసి, ప్రజలంతా మోసపోయారు. మనం అధికారంలో ఉండి ఉంటే విద్యుత్‌ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదు’’ అని చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌చార్జి మండలి బుద్ధ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-01T03:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising