అంబేడ్కర్ భవనానికి స్థలం కేటాయించాలి
ABN, First Publish Date - 2023-06-07T23:00:02+05:30
ప్రతి మండలంలో అంబేడ్కర్ భవ నాన్ని నిర్మించి, దళిత విద్యా ర్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ వ్యవసాయ కార్మి క సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది
ఆంధ్రప్రదేశ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్
ఓబులవారిపల్లె, జూన 7: ప్రతి మండలంలో అంబేడ్కర్ భవ నాన్ని నిర్మించి, దళిత విద్యా ర్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ వ్యవసాయ కార్మి క సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం రాజంపేట సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమ ర్పించారు. ఈ సందర్భంగా బీకేఎంయూ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పండుగోల మణి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీలు పేదరికం కారణంగా దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. ప్రతి మండలంలో అంబేడ్కర్ భవనానికి రెండు ఎకరాలు కేటాయించాలని కోరారు. ముక్కావారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని కొర్లకుంట క్రాస్ రోడ్డు వద్ద సర్వే నెంబరు 1085లో రెండు ఎకరాలు కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో ఈ నెల 20వ తేదీ నుండి స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట పార్టీలకు అతీతంగా దళిత, కుల సంఘాలను కలుపుకొని ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కేశం ప్రసాద్, రైల్వేకోడూరు నియోజకవర్గ సీపీఐ కార్యవర్గ సభ్యుడు గానుగపెంట ఆదినారాయణ, రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడు బీదం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-07T23:00:02+05:30 IST