ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇడుపులపాయ విద్యార్థిని మృతిపై విచారణ జరపాలి

ABN, First Publish Date - 2023-02-14T23:43:48+05:30

ఇడుపులపాయ త్రిపుల్‌ఐటీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న మంగిర అఖిల (21) మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, ఉన్నతాధికారుల చేత సమగ్ర విచారణ జరిపించాలని అన్నమయ్య జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్‌ చేశారు.

అఖిల స్వగ్రామంలో విచారిస్తున్న ప్రజా సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతల డిమాండ్‌

రాయచోటిటౌన, ఫిబ్రవరి 14: ఇడుపులపాయ త్రిపుల్‌ఐటీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న మంగిర అఖిల (21) మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, ఉన్నతాధికారుల చేత సమగ్ర విచారణ జరిపించాలని అన్నమయ్య జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం రాయచోటి మండలం శిబ్యాల గ్రామం భోగ్యంపల్లికి చెందిన అఖిల ఇడుపులపాయలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయంపై ప్రజా సంఘాల నాయకులు వారి స్వగ్రామాన్ని సందర్శించి.. మృతదేహాన్ని పరిశీలించి తల్లిదండ్రులను, బంధువులను, గ్రామస్తులను విచారించారు. అనంతరం వారు మాట్లాడుతూ జరిగిన సంఘటనపై ఎలాంటి విచారణ చేయకుండానే ప్రేమ వ్యవహారం విఫలమవడంతో అఖిల ఆత్మహత్య చేసుకుందని త్రిపుల్‌ఐటీ యాజమాన్యం ప్రకటించడం సరికాదన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కళ్లు బయటికి వచ్చినట్లు ఉండడం, నాలుక బయటకు రావడం, మెడ వంకరగా ఉండడం, చేతివేళ్లు వంకర్లుగా ఉండడం, మెడకు ఏర్పడే కమిలిన గాయం, చెవుల కిందగాయం, దుస్తు ల్లోనే మలమూత్ర విసర్జన కావడం లాంటి లక్షణాలు ఉంటాయన్నారు. అయితే అఖిల మృతదేహానికి ఇలాంటి లక్షణాలు ఏవి లేవన్నారు. మెడపై ఉన్న గాయం ఉరి వేసుకున్నట్లుగా కాకుండా ఎవరో తాడుతో బిగించినట్లుగా ఉందన్నారు. ఇక ఎవరైనా వాకిలి గడియ పెట్టుకున్న తర్వాతే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుందని.. కానీ అఖిల వాకిలి గడియ కూడా పెట్టుకోకుండా ఆత్మహత్య చేసుకుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అఖిల ప్రాణాలు కోల్పోయిన వెంటనే యాజమాన్యం ఆమె తల్లిదండ్రులను పిలిపించడంలో జాప్యం చేయడమే కాకుండా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడం.. అఖిలతో కలిసి ఉంటున్న ఇతర అమ్మాయిల తల్లిదండ్రులను యాజమాన్యం పిలిపించుకుని.. వారిని ఎవరితో మాట్లాడనీయకపోవడం లాంటి సంఘటనలను చూస్తే వాస్తవాలను దాస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. అఖిల మృతిపై వాస్తవాలను బహిర్గతం చేయాలని ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు నిర్బంధించి వారి సెల్‌ఫోన్లను ఎందుకు లాక్కున్నారో యాజమాన్యం చెప్పాలని ప్రశ్నించారు. ఇక సోమవారం ఉదయం 9 గంటలకు అఖిల తన తల్లితో సంతోషంగా మాట్లాడి, క్లాసుకు పోతున్నానని చెప్పిం దని... అయితే యాజమాన్యం మాత్రం ఆ తర్వాత గంటకే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పడం ఏ మాత్రం నమ్మశక్యంగా లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్‌) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్‌, ఎంఆర్‌పీఎస్‌ జాతీయ నాయకులు రామాంజనేయులు, ఏఐఎ్‌సఎఫ్‌ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, భారత నాస్తిక సమాజం రాయలసీమ కన్వీనర్‌ తాతయ్య, రజక సంఘం నాయకులు శ్రీనివాసులు, రాజా, వెంకటేశ్‌, ఏపీ వడ్డెర విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-14T23:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising