అచ్చెన్న మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ABN, First Publish Date - 2023-04-01T22:55:28+05:30
జిల్లా పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టరు అచ్చెన్న మృతి పై సిట్టింగ్ జడ్జితో వి చారణ జరిపించాలని అఖిలపక్ష పార్టీలు, ప్ర జా సంఘాల నాయకు లు డిమాండ్ చేశారు.
అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు
కడప (మారుతీనగర్), ఏప్రిల్ 1: జిల్లా పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టరు అచ్చెన్న మృతి పై సిట్టింగ్ జడ్జితో వి చారణ జరిపించాలని అఖిలపక్ష పార్టీలు, ప్ర జా సంఘాల నాయకు లు డిమాండ్ చేశారు. దోషులు ఎంతటి వారై నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కె.మునెయ్య అధ్యక్షతన శనివారం ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు గాలి చంద్ర, టీడీపీ నాయకులు ఆ మూరి బాలదాసు, కొండాసుబ్బయ్య, కాంగ్రెస్ నాయకులు ఎస్‌ఏ సత్తార్, అయ్యవారయ్య, బండి జకరయ్య, సగిలి గురప్ప, సీపీఎం నాయకులు ఓబులేసు, ఏపీ బీసీ మహాసభ జాతీయ కన్వీనరు అవ్వారు మల్లిఖార్జున, దళిత మిత్ర సంఘం నాయకులు కైపు రామాంజనేయులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు. ప్రధానంగా డాక్టర్ సుభా్‌షచంద్ర బోస్‌తో పాటు మరో ఇద్దరు హత్య చేసినట్లు తెలిసిందన్నారు. కాగా అచ్చెన్న బతికున్న సమయంలో సంబంధిత శాఖ ఏడీలు డాక్టర్ శ్రీధర్‌లింగారెడ్డి, డాక్టర్ సురేంద్రనాథ్‌బెనర్జీ, సర్జన్ డాక్టర్ సుభాష్ చంద్రబోస్ ఆయన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఈ విషయ మై సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు, జిల్లా పోలీసు అధికారులకు అచ్చెన్న తెలియపరిచినా స్పందించకపోవడం వల్ల ఆయన తీవ్రంగా కలత చెందినట్లు తెలిసిందన్నారు. వన్‌టౌన్ సీఐ నాగరాజును వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 8న కడప అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరవఽధిక పోరాటానికి సమాయత్తమవు తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో దళిత సంఘం నాయకులు జేవీ రమణ, మాతయ్య, న్యాయవాది సంపత్‌కుమార్, విద్యార్ధి సంఘం నాయకులు వలరాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-01T22:55:28+05:30 IST