పురాతన బౌద్ధారామాలను పరిరక్షించాలి
ABN, First Publish Date - 2023-04-23T23:18:28+05:30
పురాతన బౌద్ధారామాలను పరి రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యత గా తీసుకోవాలని బుద్ధిస్ట్ కల్చ రల్ సొసైటీ సంస్థ అధ్యక్షుడు కుమారస్వామి, కార్యదర్శి బండి లెనిన ప్రసాద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్‌కుమార్, శివారెడ్డి కోరారు.
నందలూరు, ఏప్రిల్ 23 : పురాతన బౌద్ధారామాలను పరి రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యత గా తీసుకోవాలని బుద్ధిస్ట్ కల్చ రల్ సొసైటీ సంస్థ అధ్యక్షుడు కుమారస్వామి, కార్యదర్శి బండి లెనిన ప్రసాద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్‌కుమార్, శివారెడ్డి కోరారు. ఆదివారం ఆడపూరులోని బౌద్ధస్తూపాలను వారు సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ బౌద్ధస్తూపాలు అశోకుని కాలంలోనివి అని, వాటిని పర్యాటక, పురావస్తు శాఖలు సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ స్థూపాలకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ బౌద్ధారామాలను సంరక్షణకు స్థానిక ప్రజా ప్రతి నిధులు కూడా చొరవ చూపాలన్నారు. ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయా లన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని అతి పురాతనమైన చారిత్రక ప్రదేశాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధిస్ట్ కల్చరల్ సొసైటీ ట్రెజరర్ శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ పుత్తా శివారెడ్డి, మాజీ సర్పంచ నడివీధి సుధా కర్, న్యాయ వాది షేక్ మహమ్మద్ అలీ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-23T23:18:28+05:30 IST