ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinash Reddy: సిబీఐ విచారణకు ముందు విజయలక్ష్మితో అవినాష్ రెడ్డి భేటీ

ABN, First Publish Date - 2023-01-28T12:36:55+05:30

హైదరాబాద్‌: సిబీఐ (CBI) విచారణకు ముందు ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) లోటస్‌పాండ్‌లో వైఎస్‌ విజయలక్ష్మితో భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సిబీఐ (CBI) విచారణకు ముందు ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) లోటస్‌పాండ్‌లో వైఎస్‌ విజయలక్ష్మి (YS Vijayalakshmi)తో భేటీ అయ్యారు. ఆమెతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం శనివారం మధ్యాహ్నం కోటిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవుతానని చెప్పి వెళ్లిపోయారు.

వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కోటిలోని సీబీఐ కార్యాలయం (CBI Office)లో హాజరుకారుకానున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ (YCP)లో టెన్షన్ (Tension) నెలకొంది. ఇదే మొదటిసారి కావడం.. ప్రశ్నిస్తున్నది కూడా ముఖ్యమంత్రి జగన్‌కు వరుసకు సోదరుడు అవినాష్ రెడ్డి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 24నే విచారణకు రావాలని అందుకుముందురోజు సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఐదు రోజుల తర్వాత విచారణకు రాగలనని ఎంపీ బదులిచ్చారు. దీంతో ఈ నెల 25న పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు విచారణకు రావాలని మళ్లీ నోటీసు ఇచ్చారు. ఈ కేసులో అవినాష్ ప్రమేయంపై సీబీఐ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇవాళ అవినాష్‌ను అనుమానితుడిగానే ప్రశ్నించే అవకాశం ఉంది. అటు జగన్‌కు.. ఇటు భారతికి రెండు వైపుల నుంచి అవినాష్ రెడ్డి బంధువే. భారతి సొంత మేనమామ వైఎస్ భాస్కర్ రెడ్డి కొడుకే అవినాష్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం పులివెందులలో అవినాష్ రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యం లేదు. వైఎస్ వివేకానందరెడ్డే జిల్లా రాజకీయాలు చూసుకునేవారు. పులివెందులలో కూడా అవినాష్ కుటుంబానికి రాజకీయంగా పెద్ద పరపతి ఉండేదికాదు. అప్పట్లో కేవలం మున్సిపల్ రాజకీయాలకే పరిమితమయ్యేవారు. వైఎస్ మరణానంతరం జగన్ హయాంలో అవినాష్ రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది.

Updated Date - 2023-01-28T12:37:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising