ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైభవంగా బలిజపల్లె గంగమ్మ జాతర

ABN, First Publish Date - 2023-07-20T23:37:20+05:30

పట్టణంలోని బలిజపల్లె గంగమ్మ జాతర గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాదిగా భక్తజనం తరలిరావడంతో గంగమ్మ ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతాలు కిటకిటలాడాయి. ప్రధానంగా బలిజపల్లె నుంచి చుట్టుపక్కల అన్ని వీధులు సుమారు కిలోమీటరు మేర భక్తులతో నిండిపోయింది.

భారీగా హాజరైన భక్తులు

వేలాదిగా పాల్గొన్న భక్తజనం

ప్రత్యేక పూజలు

రాజంపేట, జూలై 20: పట్టణంలోని బలిజపల్లె గంగమ్మ జాతర గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాదిగా భక్తజనం తరలిరావడంతో గంగమ్మ ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతాలు కిటకిటలాడాయి. ప్రధానంగా బలిజపల్లె నుంచి చుట్టుపక్కల అన్ని వీధులు సుమారు కిలోమీటరు మేర భక్తులతో నిండిపోయింది. రాజంపేట డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో ఇరువురు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, 80 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు నిర్వహించారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, టీడీపీ నాయకుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు తదితరులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున నుంచే సాంప్రదాయబద్ధంగా చీర, సారె పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారికి జంతు బలులు ఇచ్చి జాతరను నిర్వహించారు. పట్టణ పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి. జనసేన నాయకులు మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో జాతరకు వెళ్లే భక్తులకు ఉచితంగా ఆటోలను ఏర్పాటు చేశారు. అనేక మంది భక్తులు అన్నదాన కార్యక్రమాలను, మజ్జిగ చలివేంద్రాలను, నీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేశారు.

Updated Date - 2023-07-20T23:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising