వైభవంగా భోగి పండుగ వేడుకలు
ABN, First Publish Date - 2023-01-15T00:03:19+05:30
సంక్రాంతి పండుగ పర్వదినాల్లో మొదటి రోజైన భోగి పండుగ వేడుకలను పీలేరు మండల ప్రజలు శనివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు.
పీలేరు, జనవరి 14: సంక్రాంతి పండుగ పర్వదినాల్లో మొదటి రోజైన భోగి పండుగ వేడుకలను పీలేరు మండల ప్రజలు శనివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉదయూత్పూర్వమే నిద్ర లేచి సంప్రదాయ బద్ధంగా వారి ఇళ్ల లోగిళ్ల ముందు భోగి మంటలు వేసి పండుగకు స్వాగతం పలికారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ భోగి సంబరాల్లో పాల్గొని భక్తిప్రవత్తులను చాటుకున్నారు. భోగి పండుగ సందర్భంగా పట్టణంలోని వివిధ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు భోగి మంట వేశారు. స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ముందు ఆర్యవైశ్య సంఘం, మహిళా మండలి, వాసవీ క్లబ్ గ్రేటర్, వాసవీ కపుల్స్ క్లబ్ సభ్యులు భోగి మంటలు వేసి దాని చుట్టూ కోలాటాలతో పండుగను వైభవంగా జరుపుకున్నారు. స్థానిక లయన్సక్లబ్ సభ్యులు గిడ్డంగుల సంస్థ ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు కబడ్డీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో కూనూ సత్యం, రేవూరి సుధీర్, పామిడి మల్లిఖార్జున, జూటూరు అరవింద్, జయచంద్ర, గణపతి, సోమిశెట్టి సురేశ, సకల రమేశ, ఉపాధ్యాయులు తాతయ్య, వెంకటరమణ, రామచంద్ర, ఆనంద, పోతంశెట్టి రమేశ, రహతబాషా, రాచపల్లె కృష్ణమూర్తి, శెట్టిసుబ్రహ్మణ్యం, ప్యారూఖాన, పసల చంద్ర మౌళి, గఫార్ సాహెబ్, రాజేంద్ర, లయన్సక్లబ్ సభ్యులు శశి, సత్యం రెడ్డి, సురేంద్ర రెడ్డి, సదాశివరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుర్రంకొండలో: సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజైన భోగి పండుగను శనివారం మండల ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. వేకు వ జామునే నిద్రలేచి ఇళ్ల ముందు భోగి మంటలను వేసి ఇళ్లలో ఉన్న పాత వస్తువులు భోగి మంటల్లో వేసి సంబరంగా జరుపుకున్నారు. ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గల వేసి పండుగను చేసుకొన్నారు.
కలకడలో:సంక్రాంతిలో భాగమైన భోగి పండుగను మండల ప్రజలు శనివారం వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేకువ జామునే ఇళ్ల వద్ద భోగి మంటలు వేసి రాబోయే ఉత్తరాయణ కాలంలో తమ కుటుంబాల్లో సుఖసంతోషాలు ఉండాలని కోరుకున్నారు. అలాగే మహిళలు ప్రత్యేకంగా తమ లోగిళ్లలో రంగు రంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెలను ఉంచి పండుగ శోభన సంతరింపజేశారు.
వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండల వ్యాప్తంగా భోగి పండుగ వేడుకలను వైభవంగాజరుపుకున్నారు. ప్రతి ఇంటి ముంగిట వేకువ జామున భోగిమంటలు వేసి సంబరాలు చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కార్మికులు వేకువ జామున భోగి మంటలు వేసి సంబరాలు చే శారు.
తంబళ్లపల్లెలో: సంక్రాంతి పండుగ మొదటి రోజైన భోగి పండుగను శనివారం మండల ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే చిన్నా పెద్దా తేడాల్లేకుండా ఇళ్ల ముందు, వీధుల్లో భోగి మంటలు వేసి పాత వస్తువులను అందులో వేసి ఆహుతి చేసి కొత్తదనాన్ని ఆహ్వానించారు. మహిళలు ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలను అలంకరించారు.
కురబలకోటలో: మండలంలో భోగి వేడుకలను శనివారం వైభవంగా జరుపుకున్నారు. ఉదయం ప్రజలు వారి ఇళ్లలోని పాతవస్తువులను కాల్చి భోగి మంటలు వేశారు. పంటలు బాగా పండి సిరిసంపదలు కలగాలని దేవుడిని మొక్కుకున్నారు.
మదనపల్లె, అర్బన: పట్టణంతోపాటు పల్లెలో శనివారం భోగిపండుగ ను ప్రజలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున నిద్రలేచి పుర వీధులో, పల్లెటూరుల్లో భోగిమంటలు వేశారు. అనపగుట్టలోని శ్రీకృష్ణాల యం ఆవరణలో ఆలయకమిటీ సభ్యులు భోగిమంటలు వేశారు. పట్ట ణంలో పలు కాలనీల్లో భోగిపండుగను వైభవంగా నిర్వహించారు.
బి.కొత్తకోటలో : మండలంలోని ప్రజలు శనివారం భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. వేకువ జామున లేచి భోగి మంటలు వేశారు. ఒకరికి ఒకరు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Updated Date - 2023-01-15T00:03:20+05:30 IST