మహిళల భద్రత, రక్షణకు దిశ యాప్
ABN, First Publish Date - 2023-06-10T23:11:50+05:30
దిశయాప్ మహిళల భద్రత కు రక్షణకు ఎంతగానో ఉప యోగపడుతుందని అన్నమ య్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు అన్నారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్‌రావు
రాయచోటిటౌన్, జూన్10: దిశయాప్ మహిళల భద్రత కు రక్షణకు ఎంతగానో ఉప యోగపడుతుందని అన్నమ య్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు అన్నారు. శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని మహిళా పోలీసులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు మహిళా పోలీసులు కలిసి మహిళలు, యువతకు దిశాయాప్‌పై విస్తృతంగా అవగాహన కల్పిస్తూ దిశ యాప్ ఆవశ్యకతను వివరించారు. స్మార్ట్ ఫోన్స్‌లో యాప్ రిజిస్ర్టేషన్ చేయించి ఆపద సమయంలో దిశాకు ఎస్‌ఓఎస్ బట న్ ఉపయోగించి తక్షణమే పోలీసుల సహాయం ఎలా పొందాలో మహిళల రక్షణ కోసం దిశా యాప్ విశిష్టతపై అవగాహన కల్పించాలన్నారు.
ఒంటరిగా ఆటోలు, ఇతర వాహ నాల్లో ప్రయాణించే వారు ట్రాక్ మై ట్రావెల్ అను ఆప్షన్ వినియోగించుకుంటే వారు వెళ్లే రూట్‌ను ట్రాక్ చేస్తామన్నారు. ఈ వాహనం సరైన మార్గంలో వెళ్లని పక్షంలో వెం టనే సంబంధిత ప్రాంత పోలీసులను అప్రమత్తం చేస్తుందని తెలియజేశారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరితో ఈ దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్ర్టేషన్ చేసుకుని ఆపద సమయంలో వినియోగించుకునేలా మహిళలకు అవగాహన కల్పించాలని ఎస్పీ మహిళా పోలీసులను ఆదేశించారు.
ప్రజలు సైబర్ నేరాల భారిన పడకుండా లోన్‌యా ప్స్, ఏఈపీఎస్, ఆన్‌లైన్ జాబ్ ఫ్రాడ్స్ ద్వారా జరిగే మోసాల గురించి తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ, అదనపు ఎస్పీ డాక్టర్ వీబీ రాజ్‌కమల్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ బాలకృష్ణ, దిశా ఎస్‌ఐ బిందుమాధవి పాల్గొన్నారు.
Updated Date - 2023-06-10T23:11:50+05:30 IST