ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీళ్లున్నా.. పొలాలు బీళ్లు

ABN, First Publish Date - 2023-01-11T23:54:50+05:30

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజక వర్గంలోని చక్రాయపేట మండలంలో ఏ చెరువు చూసినా నీటితో కళకళలాడు తోంది. కానీ చెరువుల కింద చూస్తే పంటలు లేక భూములు బీళ్లుగా మారిపోయి వెలవెలబోతున్నాయి. సాగుకోసం అయ్యే పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవ డంతో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించడమే దీనికి కారణం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీటితో కళకళలాడుతున్న చెరువులు

గిట్టుబాటు కాక చెరువుల కింద సాగుకు నోచుకోని భూములు

క్రాప్‌ హాలిడే ప్రకటించిన రైతులు

సీఎం నియోజకవర్గంలో ఇదీ సాగు దుస్థితి

చక్రాయపేట, జనవరి 11: సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజక వర్గంలోని చక్రాయపేట మండలంలో ఏ చెరువు చూసినా నీటితో కళకళలాడు తోంది. కానీ చెరువుల కింద చూస్తే పంటలు లేక భూములు బీళ్లుగా మారిపోయి వెలవెలబోతున్నాయి. సాగుకోసం అయ్యే పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవ డంతో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించడమే దీనికి కారణం.

రైతు దేశానికి వెన్నెముక. రైతే రాజు అంటుంటారు. తాము రైతు పక్షమని, రైతులకోసం గత ప్రభుత్వాలను మించి ఎంతో చేశామని వైసీపీ నేతలు చెబుతుంటారు. అయితే స్వయానా సీఎం నియోజకవర్గంలోనే రైతులు పంటలు సాగుచేయకుండా మానుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో ఏలికలకే తెలియాలి. అప్పలు తెచ్చి పంటలు సాగు చేసి ఆరుగాలం కష్టిస్తున్నా.. కనీస కూలికూడా గిట్టుబాటు కావడం లేదు. దీంతో నిరాశకు లోనైన పలువురు రైతులు రోజుకు రూ.500 వస్తుందనే ఆశతో వ్యవసాయం ఆపేసి కూలి పనులకు పోతున్నారు. దీంతో చక్రాయ పేటలో ఏ చెరువు కింద చూసిన కనుచూపు మేర భూములు బీళ్లుగా కనిపిస్తున్నాయి.

గతంలో చెరువుల్లో నీళ్లు ఉన్నాయంటే ప్రతి రైతు దున్ని వరి, సద్ద, రాగి ఇలా ఏదొక పంట సాగుచేసేవారు. కానీ ఇపుడు ఆ పంటలు సాగుచేయడమే మానేశారు. కారణం.. పంటలకు అధిక పెట్టుబడి, రోగాలు ఆశించడం, ఎరువుల ధరలు పెరగడం, ట్రాక్టర్‌, డీజల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగి పోవడం, వేసిన పంట చేతికొస్తుందో రాదో అనే భయంతో పంటలు చాలించారు. పంటలు పెట్టి నష్టపోయేకంటే పాడిని ఏర్పాటు చేసుకుంటే జీవించవచ్చని చాలా మంది రైతులు ఆవు, బర్రెలు పెట్టుకొని బతుకుతున్నారు. మరి కొందరు కూలి పనులకు పోతున్నారు.

ఎకరా నేలలో వరి సాగు చేయాలంటే..

ఎకరా పొలంలో వరి సాగుచేయాలంటే నాటడం, దుక్కులు, కోతలకు, సతవలకు ఇలా రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు వస్తుంది. ఒకప్పుడు పాపాఘ్ని నది కింద ఎకరా పొలంలో వరి సాగు చేస్తే 40 మూటల దిగుడి వచ్చేది. ఇప్పుడు కేవలం 10 లేదా 20 మూటల దిగుబడి వస్తోంది. 20 మూటల వడ్లు అమ్మితే మార్కెట్‌లో రూ.30 వేలు కూడా రాదు. అంటే పెట్టుబడి ఖర్చుమాత్రమే చేతికి వస్తుంది. అదే దిగుబడి తగ్గితే.. పెట్టుబడి కూడా నష ్టపోతారు. ఇక రైతులు పొలం దున్నకాల నుంచి పంట కోతల వరకు సుమారు నాలుగు నెలలపాటు చేసిన కష్టమంతా బీటికే. దీంతో చాలా మంది రైతులు వరి సాగు మానుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందే తప్ప రైతుకు ఒరిగిందేమీ లేదు. గిట్టుబాటు ధర ఉంటే పంటలు సాగుకు ముందుకొచ్చే వారు. ఇదే పరిస్థితి కొనసాగితే ముందుముందు తిండి గింజలు దొరకని గడ్డు పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రోత్సాహకం ఇచ్చి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

నష్టం తప్ప లాభం లేదు

వరి సాగుచేయడం వల్ల నష్టం తప్ప లాభం లేదు. పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. దిగుబడి తక్కువ, గిట్టుబాటు ధర లేకపోవడం కారణంగా చెరువుల నిండా నీళ్లున్నా పంటలు సాగుచేయలేకపోతున్నాం. గత రబీలో నాకున్న రెండున్నర ఎకరాల్లో రూ.55 వేలు ఖర్చు చేసి సాగుచేస్తే దిగుబడి 33 మూటలు వచ్చాయి. సాగు ఖర్చు కూడా రాలేదు.

- సుబ్బారెడ్డి, రైతు, తిమ్మారెడ్డిగారిపల్లె, చక్రాయపేట మండలం

Updated Date - 2023-01-11T23:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising