అటవీ సంరక్షణ అందరి బాధ్యత
ABN, First Publish Date - 2023-06-14T23:43:06+05:30
అటవీసంరక్షణ అందరి బాధ్యత అని, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికడుతూనే,వణ్య ప్రాణులను సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టాలి ఫ వన్య ప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి ఫ కలెక్టర్ విజయరామరాజు
కడప(కలెక్టరేట్) జూన 14: అటవీసంరక్షణ అందరి బాధ్యత అని, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికడుతూనే,వణ్య ప్రాణులను సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. బుధవారం కల్టెరేట్‌లోని స్పందన హాల్‌లో అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వ హించారు. ఈసమావేశానికి జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డీఎస్‌ఓ సందీప్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవుల సంరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటాలని అటవీశాఖాధికారులను ఆదేశించారు. వాతావరణ కాలుష్యం, నీటికొరత లేకుండా చూడాలన్నారు. అటవీ సంపదను, భూములతోపాటు, వన్య ప్రాణులను కాపాడుకోవడం మనందరి భాద్యత అన్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎర్రచందనం సంపదకు నెలవైన మన జిల్లాలోని అడవులను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు పోలీసు, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారితోపాటు, స్మగ్లర్లు ప్రవేశిస్తున్న మార్గాలను, సరిహద్దులను గుర్తిస్తూ బేస్ క్యాంపుల్లో మార్పులు చేస్తుండాలని ఆదేశించారు. రీసర్వే ఆధారంగా అటవీ భూములు గుర్తించాలన్నారు. ఈ కార్య క్రమంలో కడప ఆర్డీవోలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి మల్లికార్జున రెడ్డి, ఎస్‌ఎ్‌స ఏపీవో ప్రభాకర్‌రెడ్డి, టూరిజం అధికారి మల్లికార్జున, సామాజిక అటవీ అధికారి,స్క్వాడ్, ట్రైనీ అదికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-14T23:43:06+05:30 IST