ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా సుదర్శన హోమం

ABN, First Publish Date - 2023-09-06T23:31:06+05:30

వందలాది భక్తుల నడుమ వేడుకగా ఘనంగా సుదర్శన హోమం నిర్వహించారు.

సుదర్శన హోమం నిర్వహిస్తున్న వేదపండితులు

తరలి వచ్చిన భక్త జనం

కడప (కల్చరల్‌) సెప్టెంబరు 6: వందలాది భక్తుల నడుమ వేడుకగా ఘనంగా సుదర్శన హోమం నిర్వహించారు. బుధవారం స్థానిక సెంట్రల్‌ జైల్‌ సమీప సప్తగిరి నగర్‌లో వెలసిన శ్రీ సర్వేశ్వర మహర్షి ఆశ్రమంలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ కంచి కామకోటి పీఠం ఆశీస్సులతో ఆశ్రమ సేవా సమితి, హిందూ ధార్మిక వేత్త కల్లూరు విజ యానందరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వేద పండితులు రాజేశ్‌ భట్టర్‌ మంత్రోచ్ఛారణల నడుమ సుదర్శన హోమం, గోపూజ, సుమంగళి పూజలను పవిత్ర సంకల్పంతో భక్తి పూర్వకంగా నిర్వహించారు. సకల జీవకోటి సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని చేపట్టిన పూజా కార్యక్రమాలకు భక్త జనం తరలి వచ్చి అత్యంత భక్తి ప్రపత్తులతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సమైక్య బ్రాహ్మణ సమాఖ్య, జిల్లా అర్చక పురోహిత ఐక్యవేదిక, పుష్పగిరి క్షేత్ర ధర్మ పరిరక్షణ సేన, జగన్మాత మారెమ్మ దేవాలయం సంయుక్త సారధ్యంలో సాగిన హోమానికి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభాబాయి, విద్వాన్‌ గానుగపెంట హనుమంతరావు, ఆశ్రమ అధ్యక్షులు రాధాకృష్ణ మూర్తి, ఉమామహేశ్వర్‌రావు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నా రు. భక్తులకు ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-09-06T23:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising