ఘనంగా అన్నమాచార్యుల జయంతి
ABN, First Publish Date - 2023-05-06T23:24:53+05:30
అన్న మయ్య జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. అన్నమాచార్యుల చిత్రపటానికి కలెక్టర్ గిరీషా, డీఆర్‌ఓ సత్యనారాయణ, జిల్లా పర్యాటకశాఖ అధికారి నాగభూషణం, కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణ నివాళులర్పించారు.
నివాళులర్పించిన కలెక్టర్ గిరీష
రాయచోటి (కలెక్టరేట్), మే 6: అన్న మయ్య జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. అన్నమాచార్యుల చిత్రపటానికి కలెక్టర్ గిరీషా, డీఆర్‌ఓ సత్యనారాయణ, జిల్లా పర్యాటకశాఖ అధికారి నాగభూషణం, కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణ నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ పద కవితా పితామహుడిగా ప్రసిద్ధి చెందిన అన్నమయ్య తొలి తెలుగు వాగ్గేయకారుడన్నా రు. తన జీవితాన్ని వేంకటేశ్వరస్వామి కైంకర్యానికి అంకితం చేసిన ధన్యజీవి అని కొనియాడారు. మనుషులంతా సమానమేనని అన్నమయ్య తన కీర్తన ల ద్వారా తెలిపారన్నారు. అన్నమయ్య వాడింది ప్రజల భాష అని, అంతటి మహనీయుడి జయంతి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమం లో అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-06T23:24:53+05:30 IST