జగన్ పోవాలి.. బాబు రావాలి!
ABN, First Publish Date - 2023-01-02T23:30:13+05:30
వైసీపీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర పాలన గాడిన పడాలంటే జగన్‌రెడ్డి పోవా లి, చంద్రబాబు అధికారంలోకి రావాలని రాయ చోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎ మ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు.
రాయచోటిటౌన్, జనవరి 2: వైసీపీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర పాలన గాడిన పడాలంటే జగన్‌రెడ్డి పోవా లి, చంద్రబాబు అధికారంలోకి రావాలని రాయ చోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎ మ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 3, 4 వార్డుల్లో టీడీపీ ఆధ్వర్యంలో మన రాష్ర్టానికి ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లిల్లు తి రుగుతూ వైసీపీ అరాచక పాలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. అస్తవ్యస్తంగా ఉన్న రా ష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబునాయుడు తిరి గి ముఖ్యమంత్రి కావాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీ పీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో అవినీతి, అరాచక, భూకబ్జాల పాలన సాగుతోం దన్నారు. దీనికితోడు రాష్ట్రంలో అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, సామా న్యులు కనీసం నిత్యావసర సరుకులు కొనుక్కునే పరిస్థితులు కూడా లేకుండా పోయాయని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తానని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన జగన్ నేడు భార్యాభర్తలు, అత్తాకోడళ్ల మధ్య తగవులు సృష్టించడంతోపాటు, అనవ సరమైన కారణాలతో పింఛన్లు తొలగించడం దారుణమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలపైన అఘాయి త్యాలు పెరిగిపోయాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మె ౖనార్టీలపై దాడులు ఎక్కువయ్యాయని ఆరోపిం చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడి తెలుగుదేశం పార్టీని అధికా రంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలంతా టీడీపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్‌వలి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ ఎస్‌కే హుస్సేన్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు అతావుల్లా, టీడీపీ నేతలు మన్సూర్, జావీద్, మైనుద్దీన్, జాబీర్, ఇంతియాజ్, మహమ్మద్‌జాఫర్, మహబూబ్ బాషా, టీఎన్‌ఎస్‌ఎఫ్ సాయిప్రతాప్, కలీం, ప్రసాద్, మాజీ సర్పంచ్ జిలానీబాషా, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-02T23:30:18+05:30 IST