జగ్జీవన్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
ABN, First Publish Date - 2023-04-05T22:51:22+05:30
స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహావీర్ సర్కిల్ వద్ద జగ్జీవన్‌రామ్ విగ్రహానికి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజా సం ఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహావీర్ సర్కిల్ వద్ద జగ్జీవన్‌రామ్ విగ్రహానికి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజా సం ఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస రెడ్డి, కడప టీడీపీ ఇన్‌ఛార్జ్ వీఎస్ అమీర్‌బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరిక్రిష్ణ ఆధ్వర్యంలో మహవీర్ సర్కిల్ లోని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మేయరు సురేశ్‌బాబు, వేంపల్లెలో కాంగ్రెస్ రాష్ట్ర మీడి యా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించారు. వివరాల్లోకెళితే....
కడప (ఎడ్యుకేషన్)/(మారుతీనగర్)/వేంపల్లె/కడప రూరల్/సికెదిన్నె/పులివెందుల రూరల్, ఏప్రిల్ 5: బా బు జగ్జీవన్‌రామ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పేర్కొన్నారు. కులమతాలు, పార్టీలకతీతంగా కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు.
వేంపల్లెలో దివంగత జగ్జీవన్ రామ్ జంయతిని కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ 40 ఏళ్లు ఏకధాటిగా బీహార్‌లోని ససారా నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎంపికై ప్రపంచ రికార్డు నెలకొల్పారన్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు ద్రువకుమార్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.సుబ్ర హ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శులు, వేంపల్లె నేతలు పాల్గొన్నారు. కడప టీడీపీ లీగల్‌సెల్ ఆధ్వర్యంలో మహావీర్ సర్కిల్‌లో జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులర్పించారు.
లీగల్‌సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. బాషా, న్యాయవాదులు జి. ఓబులేసు, సురేశ్, బాలాజీ, తదిత రులు పాల్గొన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అధికార బాషా సంఘం సభ్యుడు తవ్వా వెంకటయ్య, పరిశోధనకేంద్రం సహాయ పరిశోధకులు భూతపురి గోపాలక్రిష్ణశాస్త్రి, జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటసుబ్బయ్య, డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, డీఎం ఓబులేసు పాల్గొన్నారు.
కడప పాత రిమ్స్ అల్‌షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రా మాంజనేయులు ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. జగ్జీవన్‌రామ్ సమతావాది అని బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగమల్లేశ్ కొనియాడారు. కాగితాల పెంటలోని బీసీ ఐక్యవేదిక కార్యాలయంలో జగ్జీవ న్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గోపాల్, ఆంజనేయులు, ఎల్లయ్య, శివశంకర్, వీరభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు వై.విష్ణు ప్రీతం రెడ్డి జిల్లా కార్యాలయంలో జగ్జీవన్ చిత్రపటానికి నివాళులర్పించారు. చింత కొమ్మదిన్నె మండలం కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో జగ్జీవన్‌రామ్ జయంగి నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్తలు శిల్పకళ, లావణ్య, ప్రశాంతి, మహేశ్‌బాబు, సాయిమహేశ్వరి, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రామలక్ష్మిదేవి, ప్రత్యూష పాల్గొన్నారు. పులివెందుల వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేత లు ఆర్.కృష్ణమూర్తి, సూర్యనారాయణ, మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సి పల్‌చైర్మన్ వరప్రసాద్ జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించారు.
Updated Date - 2023-04-05T22:51:22+05:30 IST