చెస్‌లో అంతర్జాతీయ క్లాసికల్ రేటింగ్ సాధించిన కడప చిన్నోడు
ABN, First Publish Date - 2023-05-10T23:00:29+05:30
చెస్ క్రీడలో కడప నగరానికి చెందిన లిఖిత (చెస్ క్రీడాకారుడు) అంతర్జాతీయ క్లాసికల్ రేటింగ్ సాధించాడు.

చెస్ క్రీడాకారుడు లిఖిత
కడప (స్పోర్ట్స్) మే, 10: చెస్ క్రీడలో కడప నగరానికి చెందిన లిఖిత (చెస్ క్రీడాకారుడు) అంతర్జాతీయ క్లాసికల్ రేటింగ్ సాధించాడు. దేశ రాజధాని ఢిల్లీ నగర జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో గత మార్చి 23 నుంచి 30 వరకు జరిగిన ఢిల్లీ ఇంటర్‌నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో లిఖిత పాల్గొని ముగ్గురు అంతర్జాతీయ రేటెడ్ క్రీడాకారుల మీద గెలుపొందారు. మరో ఇద్దరు అంతర్జాతీయ రేటెడ్ క్రీడాకారులతో ఆడి డ్రా చేసి... 1066 అంతర్జాతీయ క్లాసికల్ పీడే చెస్ రేటింగ్ సాధించారని జిల్లా చెస్ అసోసియేషన సెక్రటరీ అనీష్ దర్బారి వెల్లడించారు.
Updated Date - 2023-05-10T23:00:29+05:30 IST