అభివృద్ధి పేరుతో కడప నగరం సర్వనాశనం
ABN, Publish Date - Dec 27 , 2023 | 11:32 PM
అభివృద్ధి పేరుతో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా కడప నగరాన్ని సర్వనాశనం చేశాడని నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి మాధవీరెడ్డి ఆరోపించారు.
కడప నియోజవ ర్గ టీడీపీ ఇనచార్జి మాధవీరెడ్డి
కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 27 : అభివృద్ధి పేరుతో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా కడప నగరాన్ని సర్వనాశనం చేశాడని నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి మాధవీరెడ్డి ఆరోపించారు. బుధవారం కడప నగరం రవీంద్రనగర్‌లో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రం అందించారు. టీడీపీ అధికరంలోకి వచ్చాక చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. వైసీపీ వైఫల్యాలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ బుగ్గవంక సుందరీకరణ పేరుతో ఇళ్లు కూల్చి ప్రజలకు సరైన సదుపాయాలు కల్పించలేదన్నారు. కడప నగరంలో ఏం అభివృద్ధి చేశారో అంజద్‌బాషా స్పష్టం చేయాలన్నారు. బాగున్న సెంటర్లు, కూడళ్లు కూల్చి వారి అనుయాయులకు కాంట్రాక్టు ఇచ్చి నాసిరకంగా పనులు చేయించారని ఆరోపించారు. పేదల సమస్యలు పట్టించుకోకుండా కూడళ్లు సుందరీకరణ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. బుగ్గవంక పరివాహక ప్రాంతాల్లో ప్రజల ఇంటి వద్ద మట్టి కుప్పలను వదిలివెళ్లిన విషయం గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రజలకనుకూలంగా పనిచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కడప నగరం 30వ డివిజను పాలెంపాపయ్యవీఽధి, ఏడురోడ్లకూడలి, ఓల్డ్ రిమ్స్, గుంతబజారు ప్రాంతాల్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఇనఛార్జ్ మాధవీరెడ్డి తనయుడు శ్రావణ్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి టీడీపీని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కడప నగరంలో చంద్రబాబు హ యాంలో మంజూరైన ఇళ్లకు కూడా జగనరెడ్డి తన పేరు పెట్టుకోవడం శోచనీ యమని విమర్శించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి జియావుద్దీన, నగర ఉపాద్యక్షులు సయ్యద్ మహ్మద్‌తో పాటు సయ్యద్ నాయబ్, జహంగీర్‌హుసేన, బాబీ, ధీరజ్, స్థానికులు పాల్గొన్నారు.
Updated Date - Dec 27 , 2023 | 11:32 PM