సాఫ్ట్ టెన్నిస్‌లో సత్తా చాటిన కృష్ణా
ABN, First Publish Date - 2023-02-12T23:02:33+05:30
రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీ ల్లో కృష్ణా జిల్లా మహిళల, పురుషుల విభాగం జట్లు సత్తా చా టి ప్రథమ స్థానంలో నిలిచారు.
కడప (స్పోర్ట్స్) ఫిబ్రవరి 12: రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీ ల్లో కృష్ణా జిల్లా మహిళల, పురుషుల విభాగం జట్లు సత్తా చా టి ప్రథమ స్థానంలో నిలిచారు. ఈనెల 11, 12 తేదీల్లో రాష్ట్ర సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఛైర్మన్ డి.నవీన్‌కుమార్, జిల్లా కార్యదర్శి రేవంత్ సారథ్యంలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షి్‌ప పోటీలు కడప డీఎ్‌సఏ మైదానంలో నిర్వహించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం డీఎ్‌సఏ మైదానంలో జిల్లా చీఫ్ కోచ్ అమృత్‌రాజ్ విజేతలకు బహుమతులను అందించారు.
మహిళల విభాగంలో ద్వితీయ విజేతగా గుంటూరు, తృతీయ విజేతగా కడప జిల్లా జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో ద్వితీయ విజేతగా అనంతపురం, తృతీ య విజేతగా కడప జట్టు నిలిచింది. ఇక సింగిల్స్ (వ్యక్తిగత) మహిళల విభాగంలో ప్రధమ విజేతగా లావ్యణ్య (కృష్ణాజిల్లా) ద్వితీయ విజేతగా యశస్వి (అనంతపురం) తృతీయ విజేతగా అనూష (కృష్ణాజిల్లా) ఇక పురుషుల సింగిల్స్ (వ్యక్తిగత) విభాగంలో ప్రథమ విజేతగా విహీద్ (కృష్ణా) ద్వితీయ విజేతగా సూర్యఆకాష్, తృతీయ విజేతగా ప్రణయ్ సాధించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, కార్యద ర్శులు, పాల్గొన్నారు.
Updated Date - 2023-02-12T23:02:35+05:30 IST