Chinarajappa: రాష్ట్రంలో అభివృద్ధి జరగకున్నా.. అప్పులపాలైంది...
ABN, First Publish Date - 2023-04-08T16:07:16+05:30
కడప: రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరక్కపోగా.. అప్పుల పాలైందని, రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి కనిపిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు.
కడప: రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరక్కపోగా.. అప్పుల పాలైందని, రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి కనిపిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప (Nimmakayala Chinarajappa) అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిత్యావసర సరుకులు (Essential Commodities), కరెంట్ (Current), ఆర్టీసీ (RTC), పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. సీఎం జగన్ (CM jagan) అమ్మఒడి ఇచ్చి స్కాలర్ షిప్‌లు రద్దు చేశారని విమర్శించారు. అన్ని వర్గాల వారికి తీవ్ర మోసం చేశారన్నారు. ఉద్యోగస్తులకు 1వ తేదీన జీతాలు, టీఏ, డిఏ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారని.. అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లలో పెట్టి బెదిరిస్తున్నారని చిన్నరాజప్ప అన్నారు.
వైసీపీ (YCP) నాలుగు సంవత్సరాల పరిపాలన కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగు బాటు వచ్చిందని చిన్నరాజప్ప అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh) పర్యటనలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జగన్ సంక్షేమ పథకాలు అరకొర మందికి ఇచ్చి లక్షలాది మందికి ఇచ్చామని చెప్పుకుంటున్నారని చిన్నరాజప్ప విమర్శించారు.
Updated Date - 2023-04-08T16:07:16+05:30 IST