రాక్షస రాజ్యం పోవాలి.. బాబు రావాలి
ABN, First Publish Date - 2023-10-03T23:35:30+05:30
రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోవాలి.. బాబు రాజ్యం రావాలంటూ టీడీపీ మహిళా నేతలు మదనపల్లెలో కొవ్వొత్తుల తో భారీ నిరసన చేశారు.
మదనపల్లె టౌన, అక్టోబరు 3:రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోవాలి.. బాబు రాజ్యం రావాలంటూ టీడీపీ మహిళా నేతలు మదనపల్లెలో కొవ్వొత్తుల తో భారీ నిరసన చేశారు. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా ఆదేశాల మేరకు స్థానిక శివాజీనగర్‌లో టీడీపీ మహిళా నాయకురాలు హసీనా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మాజీ, సుజాత తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలో జగన పాలన చూస్తుంటే బ్రిటీష్ వారి పాలనను తలదన్నే విఽధంగా ఉందని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ దుయ్యబట్టారు. మంగళవారం స్థానిక అన్నమయ్యసర్కిల్‌లోని టీడీపీ కార్యాలయం వద్ద దొమ్మలపాటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహా రదీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దొమ్మలపాటి మాట్లాడుతూ ఒక్క అవకాశం అంటూ ప్రజలను నమ్మించి అధికారంలో కి వచ్చిన జగన అభివృద్ధిని మరచి అరాచకాలు చేస్తున్నారన్నారు. అవి నీతిని ప్రశ్నించిన వారిపై నియంతలా కేసులు బనాయిస్తున్నారని, ఎలాంటి ఆఽధారాలు లేకున్నా చంద్రబాబును అరెస్టు చేసి రిమాండుకు పంపారన్నారు. మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఊరట తీర్పు చూ స్తుంటే దేశంలో న్యాయం బతికే ఉందని, చంద్రబాబుపై బనాయించిన అన్ని కేసులు వీగిపోతాయాని అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి యశశ్విరాజ్, భవానిప్రసాద్, మోడెం సిద్దప్ప, రెడ్డెప్పరెడ్డి, చెక్కా రామ్మోహనబాబు, టీఎనటీయూసీ అధ్యక్షుడు కొండ్రెడ్డి, తులసీధర్‌నాయుడు, ఎస్‌ఎల్‌వీ రఘు, చల్లా నరసింహులు, విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు కోసం టీడీపీ నేతల తిరుమల పాదయాత్ర
కురబలకోట, అక్టోబరు 3: వైసీపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు బెయిల్ రావాలని సత్యసాయి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. మంగళవారం మండలంలోని అంగళ్లుకు చేరుకుంది. కాగా వారికి రాజంపేట పార్లమెంటరీ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్, తెలుగు యువత ప్రధానకార్యదర్శి అయూబ్ బాషాల ఆధ్వ ర్యంలో ఘన స్వాగతం పలికారు. కాగా పాద యాత్ర లో టీడీపీ జెండా లను, కండువాలను పట్టుకుని వెళ్లరాదని పోలీసులు హెచ్చరించారు. అయితే అంగళ్లుకు చేరుకున్న వారి పాద యాత్రకు రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్రయా దవ్‌ధైర్యం చెప్పి పార్టీ కండువాలు, జెండాలతో పాదయాత్రను కొనసాగించి సీటీయం వరకు నడిచారు. కార్యక్రమంలో టీఎనఎస్‌ఎప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజు లనాయుడు, సర్పంచ నాగేంద్ర, ఎంపీటీసీ శ్రీనివాసులు, రమేష్, బాల కృష్ణ, అయూబ్‌భాషా, మోహనరెడ్డి, విశ్వనాథ్, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2023-10-03T23:35:30+05:30 IST