ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దె భవనాల్లోనే రైతు భరోసా కేంద్రాలు

ABN, First Publish Date - 2023-06-11T22:58:06+05:30

అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె భవనాల నుంచి విముక్తి కల్పిస్తామని వైసీపీ నేతలు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి.

గోపగుడిపల్లెలో మధ్యలోనే ఆగిపోయిన భవన నిర్మాణం,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామాపురం, జూన 11: అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె భవనాల నుంచి విముక్తి కల్పిస్తామని వైసీపీ నేతలు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి. వారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఇప్పటి వరకు ఆయా భవనాల నిర్మాణాలు పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. మండలంలో 13 గ్రామ పంచాయతీ లుండగా గొల్లచెరువుపల్లె, గోపగుడిపల్లె గ్రామాల్లోని ఆర్బీకే భవనాల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల భవ నాలు పూర్తి చేసినా, బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రా క్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గోపగుడి పల్లె రైతు భరోసా కేంద్రం ఇప్పటికీ అద్దె భవనంలోనే కొన సాగుతోంది. గువ్వలచెరువులో నిర్మాణం పూర్తయినా, ఇప్పటి వరకూ గ్రామంలోని పాత పంచాయతీ కార్యాలయ భవనంలోనే నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఆర్బీకే భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై ఏవో నాగమణిని వివరణ కోరగా గోపగుడిపల్లె ఆర్బీకేను అద్దె భవనంలో నిర్వహిస్తుండగా, సూర్య నారాయణపురం, గొల్లచెరువు గ్రామాల్లో ఆర్బీకే భవనాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కల్ప నాయుని చెరువులో పాత భవనంలోనే కొనసాగి స్తున్నారన్నారు. జేఈ చంద్ర ఓబుల్‌రెడ్డి మాట్లాడు తూ గోపగుడిపల్లెలో ఆర్బీకే భవన నిర్మాణం మధ్య లోనే ఆగిపోయిందని, పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టరు ముందుకు రావడం లేదని గువ్వలచెరువులోని భవనం పూర్తయిందని, త్వరలో ప్రారంభిస్తామన్నారు.

Updated Date - 2023-06-11T22:58:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising