ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘సచివాలయ ఉద్యోగులు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి’

ABN, First Publish Date - 2023-07-15T23:16:09+05:30

పాఠశాల విధులపై సచివాలయ ఉద్యోగులు, మహిళా పోలీసులు, ఏఎనఎంలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు సిద్దవటం ఎం పీడీవో కార్యాలయంలో శనివారం అవగాహన కల్పించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దవటం, జూలై 15: పాఠశాల విధులపై సచివాలయ ఉద్యోగులు, మహిళా పోలీసులు, ఏఎనఎంలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు సిద్దవటం ఎం పీడీవో కార్యాలయంలో శనివారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి రాఘవ రెడ్డి, సర్వశిక్ష అభియాన పీడీ అంబవరం ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు ప్రభుత్వ పాఠశాల లకు వెళ్లి మధ్యాహ్న భోజనం మెనూను పరిశీలించడంతోపాటు, విద్యార్థు లు సరిగ్గా బడికి వస్తున్నారా లేదా అని గమనించాలన్నారు. అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హులు, అనర్హులను గుర్తించాలన్నారు. ఏఎనఎంలు విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని అవసరమైన మందులు అంద జేయాలని సూచించారు. నాడు-నేడు ద్వారా జరుగుతున్న ప్రభుత్వ కార్యా లయాల నిర్మాణాలను ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు సందర్శించి పనులు త్వరి తగతిన పూర్తయ్యేలా చూడాలని ఎంబుక్‌లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. మహిళా పోలీసులు గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా నిరోధించాలన్నారు. చదవని పిల్లలు ఎవరైనా ఉంటే చదువుకునేందుకు ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు శంకరయ్య, అరుణ, ఈవోపీఆర్‌డీ పులిరాంసింగ్‌, జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, మండలంలోని వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, మహిళాపోలీసులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, ఏఎనఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-15T23:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising