శివరాత్రి క్రికెట్ విజేత టంగుటూరు
ABN, First Publish Date - 2023-02-18T23:20:02+05:30
మండ లంలోని మదనగోపాలపురం గ్రామ పంచాయతీ చింతకాయల పల్లెలో శివరాత్రి పండుగను పురస్క రిం చుకొని నిర్వహించిన క్రికెట్ టోర్న మెంట్‌లో టంగుటూరు క్రికెట్ ఆటగాళ్లు విజేతలుగా నిలిచారు.
నందలూరు, ఫిబ్రవరి 18: మండ లంలోని మదనగోపాలపురం గ్రామ పంచాయతీ చింతకాయల పల్లెలో శివరాత్రి పండుగను పురస్క రిం చుకొని నిర్వహించిన క్రికెట్ టోర్న మెంట్‌లో టంగుటూరు క్రికెట్ ఆటగాళ్లు విజేతలుగా నిలిచారు. మ దనమోహనాపురంపై విజయం సాధించి 20 వేల రూపాయలు, షీల్డ్‌ను సొంతం చేసుకున్నారు.. రన్నర్స్‌గా నిలిచిన మదనమోహనా పురం ఆటగాళ్లు 15వేల రూపా యలు, షీల్డ్‌ను అందుకున్నారు. దాదాపు 20 టీములు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌కు ఎంపీటీసీ సుబ్బయ్య రూ. 35 వేలు, కడప సుబ్బయ్య రూ. 10వేలు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భువనబోయిన లక్ష్మణ నరసయ్య, టీడీపీ నాయకులు చుక్కా యానాది, టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-18T23:20:03+05:30 IST