ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రయోజనకరం

ABN, First Publish Date - 2023-01-28T23:41:12+05:30

తపాలా శాఖ అం దిస్తున్స సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాదారులకు ఎంతో ప్రయోజనకరమని తపాల శాఖ తిరుపతి డివిజన సీనియర్‌ సూపరింటెండెంట్‌ మహమ్మద్‌ జాఫర్‌ సాధిఖ్‌ పేర్కొన్నారు.

ఖాతాదారులకు పాసుబుక్కు అందజేస్తున్న ఎస్‌ఎస్‌పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, జనవరి 28: తపాలా శాఖ అం దిస్తున్స సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాదారులకు ఎంతో ప్రయోజనకరమని తపాల శాఖ తిరుపతి డివిజన సీనియర్‌ సూపరింటెండెంట్‌ మహమ్మద్‌ జాఫర్‌ సాధిఖ్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ‘ఏక్‌ దిన మే ఏక్‌ కరోడ్‌’(ఒక రోజులో ఒక కోటి) పొదుపు ఖాతాలు ప్రారంభించేందుకు తాము ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. అందు లో భాగంగా పీలేరు డివిజనలో 1700 ఖాతాలు, వాల్మీకిపురంలో 1500 ఖాతాలు ప్రారం భించామన్నారు. ఈ అవకాశం ఆదివారం కూడా అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం ఖాతాలు ప్రారంభించిన వారికి పాసు బుక్కులు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో పోస్టుమాస్టర్‌ శేషాద్రి, పోస్టల్‌ ఇనస్పెక్టర్‌ విజయభాస్కర్‌ పాల్గొన్నారు.

తపాలా ఖాతాల ద్వారా డిజిటల్‌ చెల్లింపులు

కలికిరి, జనవరి 28: తపాలా కార్యాలయా ల్లో నిర్వహించే ఖాతాల ద్వారా డిజిటల్‌ చెల్లింపుల సౌకర్యం కల్పించినట్లు తిరుపతి తపాలా శాఖ సూపరింటెండెంట్‌ షేక్‌ జాఫర్‌ సాదిక్‌ వెల్లడించారు. అన్ని ఐపీపీ బీ ఖాతాలకు ఈ సౌకర్యం వర్తిస్తుందని చెప్పారు. ‘ఒక రోజులో కోటి ఖాతాలు’ (ఏక్‌ దిన మే ఏక్‌ క్రోర్‌ అకౌంట్స్‌) కార్యక్ర మం విజయవంతం కోసం ఆయన శనివారం స్థానిక ఇందిరమ్మ కాలనీలో ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏడాదికి రూ.396లు వంతున ప్రీమియం చెల్లించి రూ.10 లక్షల బీమా సౌకర్యం పొందవచ్చని చెప్పారు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలతో ఆడ బిడ్డలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. శనివారం మొత్తం 300 ఖాతాలు ప్రారంభించినట్లు కలికిరి సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌ నిరంజన కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎస్‌ఓ నిరంజన కుమార్‌, మెయిల్‌ ఓవర్‌సీస్‌ సోమశేఖర్‌, దేవేంద్ర, మధు, జగదీష్‌, ఇమ్రాన ఇతర తపాలా సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-28T23:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising