కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీ ఎన్నికల బరిలోకి వీసీకే పార్టీ

ABN, First Publish Date - 2023-10-08T00:00:11+05:30

రాష్ట్రంలో విడుదలై చిరు తైగల్‌ కట్చి(వీసీకే పార్టీ) ఎన్నికల బరిలోకి దిగ బోతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీ యం శివప్రసాద్‌ స్ప ష్టం చేశారు.

ఏపీ ఎన్నికల బరిలోకి వీసీకే పార్టీ
మాట్లాడుతున్న వీసీకే పార్టీ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్‌

175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ

28 నుంచి రాయలసీమ యాత్ర

పార్టీ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్‌ వెల్లడి

మదనపల్లె, అక్టోబరు 7: రాష్ట్రంలో విడుదలై చిరు తైగల్‌ కట్చి(వీసీకే పార్టీ) ఎన్నికల బరిలోకి దిగ బోతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీ యం శివప్రసాద్‌ స్ప ష్టం చేశారు. శనివారం స్థా నిక బాస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర రాజకీయం కేవలం రెండు కుటుం బాలు, రెండు కులాలు, రెండు పార్టీలకు వారసత్వ ఆస్థి గా మారిపోయిందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో నూతన అధ్య యనా నికి సమరశంఖం పూరించేందుకు వీసీకే పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలందరూ బాగ స్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే సార్వ త్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానా లకు వీసీకే పార్టీ అఽభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. రాయల సీమ జిల్లాలలోని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్య ర్థుల ను సన్నద్ధం చేసేందుకు ఈ నెల 28 నుంచి రాయలసీమ యాత్ర చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్ర మంలో వీసీకే పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముత్యాల మోహన, యూత వింగ్‌ సెక్రటరీ రాయల్‌ సూర్య, స్టూడెంట్‌ వింగ్‌ సెక్రటరీ బురుజురెడ్డిప్రసాద్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-08T00:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising