ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైభవంగా వినాయక చవితి వేడుకలు

ABN, First Publish Date - 2023-09-20T00:03:08+05:30

వినాయక చవితి వేడుకలు సోమ వారం వైభవంగా నిర్వహించారు.

కురబలకోటలో బసవన్నకట్ట వినాయకుడికి పూజలు చేస్తున్న భక్తులు

మదనపల్లె అర్బన, సెప్టెంబరు19: వినాయక చవితి వేడుకలు సోమ వారం వైభవంగా నిర్వహించారు. పురవీధుల్లో వినాయక మండపాలు ఏర్పాటుచేసి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించి ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు. బైపాస్‌ రోడ్డులోని కురుబ సంఘం కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడికి అధికసంఖ్య లో హహిళలు పూజలో పాల్గొన్నారు. నీరుగట్టువారిపల్లెలో వివేకానంద ఆశయ ఫౌండేషన వ్యవస్థాపకుడు గుప్పభానుప్రకాష్‌ ఆధ్వర్యంలో వినాయకుడిని ఏర్పాటుచేసి పూజలు నిర్వహించారు. కమ్మవీధిలో అంగళ్లు మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం నాదేళ్ల విజయభా స్కర్‌ చౌదరి ఆధ్వర్యంలో గణపతిని ప్రతిష్ఠించి పూజలు నిర్వ హించా రు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో సిద్ధి, బుద్ది సమేతంగా వినా యకుడికి వైభవంగా కల్యాణం నిర్వహించి భక్తులకు అన్నదానం చేశా రు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు వసం తోత్సవం నిర్వహించి పురవీ ధుల్లో ఊరేగింపు చేశారు. కార్యక్రమాలను ఆలయకమిటీ అధ్యక్షుడు రామిశెట్టి సిద్దులయ్య(రవి), గౌరవాధ్యక్షులు కాలా సోమశేఖర్‌, కళ్లే సుధాకర్‌, సెక్రటరీ ఓబులేష్‌, ట్రేజరర్‌ నరసిం హులు, జాయింట్‌ ట్రెజరర్‌ వీరభద్రారెడ్డి, ఆలయకమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె మండలంలో వినాయకచవితి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో విభిన్న రూపాల గణపతులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. వినాయ క మండపాల వద్ద వివిధ సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతపురం జిల్లా లేపాక్షికి చెందిన రామ్మూర్తి కళా బృందంచే నిర్వ హించిన తొలుబొమ్మలాట భక్తులను అలరించింది. మంగళవారం మధ్యాహ్నం తంబళ్లపల్లెకు చెందిన మండల క్రిష్ణమూర్తి, రత్నమ్మ దంపతులు భక్తులను అన్నదానం చేశారు.

నిమ్మనపల్లెలో: మండలంలోని ప్రజలు వినాయకచవితి పండుగను సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వ హించారు. మూడు రోజుల పాటు వినాయకునికి భక్తి శ్రద్ధలతో పూజ లు నిర్వహించి మూడవ రోజున నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు.

పీలేరులో: పీలేరు మండల ప్రజలు సోమ, మంగళవారాల్లో వినాయక చవితి పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. పీలేరు పట్టణ చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గణేశ ఉత్సవ కమిటీ గణేశ లడ్డూను స్థానిక లక్ష్మీపురం కేంద్ర నిర్వా హకులు వేలంలో రూ.67 వేలకు దక్కించుకోవడంతో 85 కేజీల స్వామి వారి లడ్డూను ఉత్సవ కమిటీ సభ్యులు వారికి అప్పగించారు. ఉత్స వాల అనంతరం లడ్డూను ప్రసాదంగా పట్టణంలోని ప్రతి వినాయక సెంట ర్‌ వారికి పంచి పెడతామని లక్ష్మీపురం సెంటర్‌ నిర్వాహకులు తుమ్మ ల బాలాజీ, వినోద్‌, ముత్యం, సురేశ, రవిచంద్ర తెలిపారు. అత్యధిక కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాల్లో ముస్లింలు కూడా భాగ స్వాములై మతసారస్యాన్ని చాటుకున్నారు. పీలేరు పట్టణం ఇందిరా నగర్‌, ఎల్‌బీఎస్‌ రోడ్డులోని ‘వి’ సెంటర్‌లలో ప్రతిష్టించిన విగ్రహాలు అందరి నీ ఆకట్టుకున్నాయి. పలువురు హిందూ, ముస్లింలు కష్టపడి 8 అడుగుల మట్టి వినాయకుడిని తయారుచేసి ప్రతిష్టించారు. మంగళ వారం సాయంత్రం పట్టణంలోని చాలాకేంద్రాల్లో పిల్లలు, పెద్దలకు ఉట్టికొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో వినోద్‌ రెడ్డి, బావాపీర్‌, చందు, రాజేశ, సూరి, హరి, నాగార్జున, వెంకటేశ, ప్రకాశ, వెంకీ, షాజ్‌, కిరణ్‌, నాగేం ద్ర, తదితరులు పాల్గొన్నారు.

నేడు నిమజ్జనం: పీలేరు పట్టణంలో బుధవారం గణేశ నిమజ్జనం ఏర్పాటు చేసినట్లు గణేశ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి వారణాశి మోహన రెడ్డి తెలిపారు. పీలేరు పట్టణంలోని 80 కేంద్రాలతోపాటు పరిసర ప్రాంతాల్లోని మరో 30 కేంద్రాల వారు పీలేరు పట్టణంలో జరి గే నిమజ్జన ర్యాలీలో పాల్గొనేందుకు పోలీసుల అనుమతి తీసుకు న్నా రని ఆయన తెలిపారు. పీలేరులో బుధవారం జరిగే గణేశ నిమజ్జన ర్యాలీకి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పీలేరు అర్బన సీఐ మోహన రెడ్డి తెలిపారు. ఈ నిమజ్జన ర్యాలీ బందోబస్తు కోసం జిల్లా కేంద్రం నుంచి అదనపు బలగాలతోపాటు వాల్మీకిపురం, కలకడ, పీలే రు రూరల్‌ సర్కిళ్ల పరిధిలోని సిబ్బంది రప్పిస్తున్నట్లు సీఐ తెలిపారు.

కలకడలో:వినాయక చవితి పండుగను మండల ప్రజలు వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కలకడ, ఎర్రయ్యగారిపల్లె, కోన, బాట వారిపల్లెతోపాటు వివిధ గ్రామాల్లో వివిధ రూపాలున్న వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలను చేశారు. ప్రజలు వారి వారి ఇళ్లలో గణపయ్యలను ఏర్పాటు చేసి పూజలను చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిపి అన్నదానాలు చేశారు.

కలికిరిలో: వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం కలికిరి మండల వ్యాప్తంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. పోలీసు లు విధించిన నిబంధనలను పాటిస్తూ వివిధ రకాల వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. గ్రామాల్లో యువకులు ఉత్సాహంగా విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. మండ లంలో చాలా చోట్ల బుధవారం నిమజ్జనం నిర్వహించనున్నారు.

కురబలకోటలో: మండలంలో వాడవాడలా వినాయకచవితి పండు గ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని అంగళ్ళు, కురబలకోట, ముదివేడు, మట్లివారిపల్లె తదితర గ్రామాల్లో వినాయకుడి ప్రతిమలను ప్రతిష్టించి వేడుకలను నిర్డ్వహించారు. ఈ వేడుకల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకు న్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌, సర్పంచ విశ్వనాథరెడ్డి, వీఆర్వో అంజికుమార్‌, దామోధర్‌రెడ్డి,మణి,రాజు,హరి,విజయ్‌,మునీష్‌ పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: వినాయక చవితి పండుగను పురష్కరించు కుని మండలంలోని పలు గ్రామాల్లో చవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈసందర్బంగా బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధి లోని షిర్డీసాయిబాబా ఆలయంలో ప్రకృతి వినాయకుడుగా భక్తులకు దర్శనం ఇచ్చారు. సోమవారం భక్తులను ఆకట్టుకున్న ప్రకృతి వినాయ కుడు ప్రత్యేక అలంకరణగా నిలిచారు.

పెద్దమండ్యంలో: పెద్దమండ్యం మండలంలోని ప్రజలు వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. చవితి వేడుకల్లో భాగంగా పెద్దమండ్యం, పాపేపల్లి, సిగొల్లపల్లి, కలిచెర్ల, బండమీదపల్లి, శివపురం, ఎనవోపల్లి, ముసలికుంట, బండ్రేవు, మందలవారిపల్లి, కోటకాడపల్లి, వెలిగల్లు, సిద్దవరం తదితర గ్రామాలలో విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండలం వ్యాప్తంగా సోమవారం వినాయకచవితి పండుగ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని తోటవీధి, ఇందిరమ్మ కాలనీ, కొత్తపేట వీధి, జెట్టిపాలెం, బజారువీధి, గాంధీపేట, చాకలవీధి, తిరుపతి రోడ్డు, రామాలయం వీధి తదితర ప్రాంతాలలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసి వైభవంగా పూజలు నిర్వహించారు. తోటవీధిలోని భారీ వినాయకుడి విగ్రహ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసంద ర్భంగా విగ్రహాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

గుర్రంకొండలో:వినాయక చవితి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా వాడవాడలా వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలను చేశారు. అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-09-20T00:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising