ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinash Reddy ఫోన్‌ కాల్‌తో తెరపైకి నవీన్‌ పేరు

ABN, First Publish Date - 2023-02-01T03:29:54+05:30

వైఎస్‌ జగన్‌ బాబాయ్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు, ఆ తర్వాత పులివెందుల నుంచి ఎంపీ అవినాశ్‌రెడ్డి చేసిన ఫోన్‌ కాల్స్‌ వ్యవహారంతో కొత్తగా తెరపైకి వచ్చిన పేరు నవీన్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌ కుటుంబానికి బంటు!

నవీన్‌ సొంత ఊరు పులివెందుల

సంచలనం సృష్టించిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

కడప, జనవరి 31(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌ (YS Jagan) బాబాయ్‌ వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్య జరిగిన రోజు, ఆ తర్వాత పులివెందుల (Pulivendula) నుంచి ఎంపీ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) చేసిన ఫోన్‌ కాల్స్‌ వ్యవహారంతో కొత్తగా తెరపైకి వచ్చిన పేరు నవీన్‌. ఈ కేసులో అవినాశ్‌రెడ్డిని సోమవారం సీబీఐ (CBI) అధికారులు తొలిసారి హైదరాబాద్‌లో విచారించిన సంగతి తెలిసిందే. వివేకా హత్య తరువాత ఎంపీ ఎవరెవరికి ఫోను చేశారనే విషయమై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించడం, ఈ క్రమంలో నవీన్‌ పేరు ప్రస్తావనకు రావడంపై ‘ఆంధ్రజ్యోతి (Andhrajyothy)’ ప్రచురించిన కథనం కడప జిల్లాలో సంచలనం రేకెత్తించింది. ఎవరీ నవీన్‌ అంటూ పులివెందులలో కలకలం బయలుదేరింది.

విశ్వసనీయ సమాచారం మేరకు... నవీన్‌ అసలు పేరు గోపరాజు నవీన్‌. స్వస్థలం పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం ఇప్పట్ల. నవీన్‌ కుటుంబం చాలాకాలంగా పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో స్థిరపడింది. జగన్‌ తాతయ్య వైఎస్‌ రాజారెడ్డి (YS Rajareddy) హయాం నుంచి ఆ ఇంటి మడవలి (చాకలి)గా నవీన్‌ కుటుంబం పనిచేసేది. సుమారు 15 ఏళ్లుగా నవీన్‌... వైఎస్‌ కుటుంబం వెంటే ఉన్నాడు. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత జగన్‌ కుటుంబానికి దగ్గరయ్యాడు. కొద్దిరోజులు బెంగళూరు, హైదరాబాద్‌లోని వైఎస్‌ కుటుంబానికి చెందిన ప్యాలె్‌సలలో పనిచేశాడు. ఇప్పుడు తాడేపల్లిలో ఉంటున్నాడు. జగన్‌ కుటుంబానికి నవీన్‌ అత్యంత ఆప్తుడు, సన్నిహితుడని చెబుతారు. జగన్‌ సతీమణి భారతికి ఎవరైనా ఫోన్‌ చేసి మాట్లాడాలంటే నవీన్‌ నంబరుకే ఫోన్‌ చేయాలి. అంతగా జగన్‌ కుటుంబానికి నవీన్‌ నమ్మినబంటు. కాగా, ఇతను పేరు కూడా మార్చుకున్నట్లు ప్రచారం ఉంది. తొలుత ఇతని పేరు హరిప్రసాద్‌ అని, ఆ తరువాత నవీన్‌గా మార్చుకున్నట్లు సమాచారం.

Updated Date - 2023-02-01T08:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising