ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజీ బేసిన్‌ సముద్రంలో ఎత్తైన కొండలు

ABN, First Publish Date - 2023-02-28T04:29:27+05:30

కృష్ణా, గోదావరి బేసిన్‌ అంతర్భాగంలో ఎత్తైన కొండలు ఉన్నాయని, భవిష్యత్తులో ఎప్పుడైనా చరియలు విరిగేపడే అవకాశాలున్నాయని జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ (ఎన్‌ఐవో-పనాజి) డైరెక్టర్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భవిష్యత్తులో కొండ చరియలు విరిగిపడే అవకాశం

అదే జరిగితే పరిసర ప్రాంతాల్లో భూకంపాలు

ఎన్‌ఐవో డైరెక్టర్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌

కృష్ణా, గోదావరి బేసిన్‌ అంతర్భాగంలో ఎత్తైన కొండలు ఉన్నాయని, భవిష్యత్తులో ఎప్పుడైనా చరియలు విరిగేపడే అవకాశాలున్నాయని జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ (ఎన్‌ఐవో-పనాజి) డైరెక్టర్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. ఎన్‌ఐవో విశాఖ ప్రాంతీయ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడకు విచ్చేసిన ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేజీ బేసిన్‌ ముఖ ద్వారం నుంచి ఒండ్రు, ఇసుక, ఇతర వ్యర్థాలు సముద్రంలో కలిసేచోట అత్యంత లోతైన అగాధం ఉందన్నారు. ఇదే ప్రాంతానికి సమీపంలో చాలా ఎత్తులో కొండలు ఉన్నాయని పేర్కొన్నారు. కేజీ బేసిన్‌పై 20 ఏళ్ల నుంచి ఎన్‌ఐవో పరిశోధన సాగిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ప్రాథమికంగా అంచనాకు వచ్చామన్నారు. కొండ చరియలు విరిగిపడితే కేజీ బేసిన్‌ పరిసరాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం లేకపోలేదన్నారు. అయితే దీన్ని ఇప్పుడే నిర్ధారించలేమని.. మరింత విస్తృత అధ్యయనం అవసరమని వెల్లడించారు. కేజీ బేసిన్‌లో మిథేన్‌ గ్యాస్‌ నిల్వలున్నట్టు తమ పరిశోధనల్లో తేలిందన్నారు. మిథేన్‌ వాయువులు విడుదలైతే కార్బన్‌ డయాక్సైడ్‌ తీవ్రత పెరిగి.. గ్రీన్‌హౌ్‌స వాయువులు వెలువడే అవకాశం ఉందన్నారు. దీనివల్ల సముద్ర ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. తూర్పు తీరంలో కేజీ బేసిన్‌ కాకుండా మరికొన్ని చోట్ల చేసిన పరిశోధనల్లో చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నట్టు నిర్ధారించామన్నారు. విశాఖలో ఎన్‌ఐవో ప్రాంతీయ కార్యాలయానికి సొంత భవనం సమకూర్చేలోగా మరింత పటిష్ఠం చేస్తామని సునీల్‌ కుమార్‌ సింగ్‌ వెల్లడించారు.

Updated Date - 2023-02-28T04:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!