ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu ACB Court: 16న బాబును కోర్టులో హాజరుపరచాలని ఆదేశం

ABN, First Publish Date - 2023-10-12T16:43:44+05:30

ఫైబర్‌నెట్‌ కేసులో పీటీ వారెంట్‌‌పై విచారణకు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం (16-10-2023) చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరుపరచాలని న్యాయమూర్తి తీర్పు

విజయవాడ: ఫైబర్‌నెట్‌ కేసులో పీటీ వారెంట్‌‌పై విచారణకు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం (16-10-2023) చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరుపరచాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు కోర్టులో హాజరుపరచాలని జడ్జి ఆదేశించారు.

34 రోజులుగా రిమాండ్‌లో..

ఇదిలా ఉంటే చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబుకు ఈనెల 19 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ ఉంది. తాజాగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును సోమవారం వ్యక్తిగతంగా హాజరుపర్చాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

వాదనలు ఇలా..

ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్లపై ఉదయం నుంచి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో రేపు క్వాష్ పిటిషన్ విచారణ ఉన్న నేపథ్యంలో తీర్పు రేపటికి వాయిదా వేయమని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీకి సంబంధించిన న్యాయవాదులు వచ్చిన తర్వాత వాళ్ల అభిప్రాయం కూడా తీసుకొని నిర్ణయం చెబుతానని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చివరికి పీటీ వారెంట్‌‌పై విచారణకు ఏసీబీ కోర్టు సమ్మతించింది.

Updated Date - 2023-10-12T16:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising