దుర్గగుడిలో ఘనంగా ఆదిశంకరుల జయంతి
ABN, First Publish Date - 2023-04-26T01:14:46+05:30
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం ఆదిశంకరాచార్య జయంతిని ఘనంగా నిర్వహించారు.
వన్‌టౌన్, ఏప్రిల్ 25 : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం ఆదిశంకరాచార్య జయంతిని ఘనంగా నిర్వహించారు. వైదిక సిబ్బంది, వేదపండితు లు, అర్చకులు ఆదిశంకరాచార్య విగ్రహానికి పంచామృతాభిషేకం, శంకరపూజ, యతివందనం నిర్వహించారు. చింతపల్లి ఆంజనేయ ఘనాపాఠి, పురాణపండితుడు చింతలపాటి వెంకటేశ్వర శర్మ ఆదిశంకరాచార్యుల వైభవాన్ని వివరించారు. స్థానాచార్యుడు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ, వేద విద్యార్థులు, ఈవో భ్రమరాంబ, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, సభ్యులు కట్టా సత్తయ్య, చింకా శ్రీనివాసులు, బుద్దా రాంబాబు, బచ్చు మాధవీకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు నగర సమీపంలోని చిన్నకంచికి చెందిన సదాశివానంద సరస్వతి స్వామీజీ విచ్చేశారు. ఆయన కు యతి పూజ నిర్వహించి సత్కరించారు. దుర్గమ్మ ద ర్శనం చేసుకున్న ఆయనకు సంప్రదాయ మర్యాదలను అందజేశారు. అనంతరం ఆయన అనుగ్రహభాషణ చే శారు. వేదపండితులు వేదస్వస్తి పలికారు. అనంతరం నగరోత్సవం నిర్వహించారు. కనకదుర్గనగర్, రథంసెంటర్, బ్రాహ్మణవీధి, కోమలవిలా్‌ససెంటర్, సామారంగంచౌక్ మీదుగా తిరిగి మహామండపం చేరుకుంది.
అన్నదానానికి విరాళం
దుర్గగుడిలో జరగుతున్న నిత్యాన్నదాన పథకానికి తిరుపతి రైల్వే కాలనీకి చెందిన పేరూరు యుగంఽఽధర్, సురేఖ రూ.లక్ష విరాళాన్ని మంగళవారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబుకు అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం దాత కు శేషవస్త్రం, ప్రసాదం, ఆశీస్సులు అందజేశారు.
Updated Date - 2023-04-26T01:14:46+05:30 IST