ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనులు చేయలేం..

ABN, First Publish Date - 2023-04-30T00:35:40+05:30

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మంచినీటి పైపులైన్ల పనులపై పాత బకాయిలు తేల్చితే తప్ప కొత్తగా ఏమీ చేయలేమని ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.

కాంట్రాక్టర్లతో మాట్లాడుతున్న కలెక్టర్‌ దిల్లీరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాత బకాయిలు తేల్చాలంటూ కలెక్టర్‌ దిల్లీరావుకు వినతి

ఆత్మహత్యలే గతి అంటూ ఆవేదన

త్వరలో బిల్లులు ఇప్పిస్తానన్న కలెక్టర్‌

ప్రభుత్వం వినే ధోరణిలో లేదన్న కాంట్రాక్టర్లు

అసంపూర్తిగా ముగిసిన సమావేశం

విజయవాడ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మంచినీటి పైపులైన్ల పనులపై పాత బకాయిలు తేల్చితే తప్ప కొత్తగా ఏమీ చేయలేమని ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లతో శనివారం కలెక్టర్‌ దిల్లీరావు అత్యవసరంగా సమావేశమయ్యారు. కాంట్రాక్టర్లు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తొలిదశలో చేపట్టిన ఆరున్నర కోట్ల రూపాయల బిల్లులు రాకపోవటం వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్‌ ముందుంచారు. జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనుల్లో భాగంగా కేంద్రం మ్యాచింగ్‌ గ్రాంట్‌ భరిస్తోందన్న ఉద్దేశంతో ఈ పనులకు అంగీకరించామని, జేజేఎం పనులను జగనన్న హౌసింగ్‌ స్కీమ్‌ (జే హెచ్‌సీ) పనులుగా రాష్ట్ర ప్రభుత్వం మార్చటం వల్ల చట్టపరంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. జేజేఎం పనులన్న ఉద్దేశంతో తాము అప్పులు తెచ్చి మరీ పనులు చేశామని చెప్పారు. లాభాలు రావడమనేది పక్కనపెడితే, అప్పులు తీర్చటానికైనా డబ్బు వస్తే చాలనుకుంటున్నామన్నారు. ఏడాదిగా బిల్లులు రాకపోవటం వల్ల హీనమైన పరిస్థితులు చవిచూస్తున్నామని, ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో గడవని పరిస్థితులు కూడా నెలకొన్నాయని, చెప్పుకొంటే సిగ్గుచేటన్నారు. సమస్యలన్నీ విన్న కలెక్టర్‌ దిల్లీరావు ఇబ్బందులను తాను అర్థం చేసుకుంటానని, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ చెప్పిన మాటలకు తాము ప్రభావితమయ్యామని, కానీ ప్రభుత్వం వినే పరిస్థితిలో లేకపోవటం వల్ల ముందుకెళ్లేలేమని సమావేశం అనంతరం కాంట్రాక్టర్లు బయటకు వచ్చి మీడియాతో చెప్పారు.

సమస్యలు పరిష్కరిస్తాం.. : కలెక్టర్‌

గుత్తేదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో నీటి సరఫరా పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.5.65 కోట్లను త్వరలో చెల్లిస్తామని కలెక్టర్‌ దిల్లీరావు గుత్తేదారులకు తెలిపారు. కాంట్రాక్టర్లతో ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో చేపట్టిన పనులకు గానూ రూ.6.06 కోట్ల బిల్లులు చెల్లించామని, ఇంకా రూ.6.56 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుత్తేదారులు పూర్తిచేసిన పనులకు సంబంధించి రూ.5.65 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. తాత్కాలిక నీటి సరఫరాకు సంబంధించి వారంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎం.రజినీకుమారి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ దేవినేని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-30T00:35:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising