Chandrababu ACB Court: మరోసారి కోర్టుకు వచ్చిన సిద్ధార్థ్ లూథ్రా.. ఆసక్తికరంగా..!
ABN, First Publish Date - 2023-09-10T16:48:06+05:30
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాలు వాదనలు వినిపించారు. ఉదయం నుంచీ భోజన విరామం వరకూ వాదనలు వినిపించారు. బ్రేక్ అనంతరం కూడా ఇరువర్గాలు వాదనలు వినిపించారు. ఇలా ఉదయం నుంచి ఏడున్నర గంటల పాటు వాదనలు జరిగాయి. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం
విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాలు వాదనలు వినిపించారు. ఉదయం నుంచీ భోజన విరామం వరకూ వాదనలు వినిపించారు. బ్రేక్ అనంతరం కూడా ఇరువర్గాలు వాదనలు వినిపించారు. ఇలా ఉదయం నుంచి ఏడున్నర గంటల పాటు వాదనలు జరిగాయి. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు వినిపించగా... చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపించారు. ప్రస్తుతం తీర్పు రిజర్వ్‌లో ఉంది. దీనిపై సర్వత్రా ఉత్కంఠ చోటుచేసుకుంది.
ఇదిలా ఉంటే వాదనలు ముగిసిన తర్వాత బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా.. మరోసారి విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చారు. ఉదయం 8 గంటల నుంచీ వాదనలు వినిపించిన అనంతరం మ.2 గంటలకు కోర్టు నుంచి వెళ్లిపోయారు. మరోసారి కొన్ని పేపర్లతో కోర్టుకు వచ్చారు. మరికాసేపట్లో కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు రావడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఏసీబీ కోర్టుకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. బెయిల్ వస్తుందన్న ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. వాదనలు ముగిసినా... తీర్పు మాత్రం ఇంకా రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Updated Date - 2023-09-10T16:50:37+05:30 IST