ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: మహిళా శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష

ABN, First Publish Date - 2023-01-10T16:19:02+05:30

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) మహిళా శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష (Review) నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) మహిళా శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష (Review) నిర్వహించారు. అంగన్‌వాడీలలో నాడు – నేడుపై సమీక్ష జరిపారు. మూడు విడతల్లో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అంగన్‌వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. పాలు (Milk), గుడ్లు (Eggs) లాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని.. పంపిణీలో ఎక్కడైనా లోపాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు.

పిల్లలకు ప్లేవర్డ్‌ పాలు పంపిణీ కోసం పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలని, మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ప్లేవర్డ్‌ మిల్క్‌ పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. అంగన్‌వాడీలలో డిజిటల్‌ పద్ధతుల్లో బోధనపై ఆలోచనలు చేయాలన్నారు. తల్లి, బిడ్డ.. రక్తహీనత, పౌష్టికాహారలోపంతో బాధపడుతుంటే.. వాటిని నివారించడానికి సమగ్రమైన కార్యాచరణ చేపట్టాలని, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

Updated Date - 2023-01-10T16:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising