NIA Court: కోడి కత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందే: న్యాయమూర్తి

ABN, First Publish Date - 2023-01-13T14:55:19+05:30

విజయవాడ: కోడి కత్తి శ్రీనివాస్ కేసులో ఎన్ఐఏ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు.

NIA Court: కోడి కత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందే: న్యాయమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కోడి కత్తి శ్రీనివాస్ కేసు (Kodi Katthi Srinivas Case)లో ఎన్ఐఏ కోర్టు (NIA Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ (CM Jagan) కోర్టుకు రావాల్సిందేనని కోర్టు టేప్‌ రికార్డర్గా ఉండదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితుడిని నేటి వరకూ ఎందుకు విచారించలేదని నిందితుడి తరపు న్యాయవాది సలీమ్ ప్రశ్నించారు. సమాధానంగా స్టేట్‌మెంట్ రికార్డు చేశామని ఎన్‌ఐఏ న్యాయవాది చెప్పారు. రికార్డు చేస్తే చార్జ్‌షీట్‌లో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను.. విచారించి ఉపయోగం ఏముందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిగా ఉన్న సీఎం కోర్టుకు రావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు.

56 మందిని ఈ కేసులో విచారిస్తే 1 నుంచి 12 వరకూ ఉన్నవారి స్టేట్‌మెంట్లు.. చార్జ్‌షీట్లో ఎందుకు లేవని ఎన్‌ఐఏ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఈనెల 31వ తేదీ నుంచి విచారణకు న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది. కోర్టుకు బాధితుడు సహా మిగతా వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని జడ్డి స్పష్టం చేశారు. కాగా కోడి కత్తి కేసులో శ్రీనివాస్‌కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ నిరాకరించింది.

Updated Date - 2023-01-13T15:04:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising