ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawadsa: జీవో1 రద్దు చేయాలని కోరుతూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సదస్సు నేడు

ABN, First Publish Date - 2023-02-19T10:57:40+05:30

విజయవాడ: ప్రజస్వామ్య హక్కులను కాలరాసే జీవో నంబర్ 1 (GO 1)ను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు (State Level Conference) జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రజస్వామ్య హక్కులను కాలరాసే జీవో నంబర్ 1 (GO 1)ను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు (State Level Conference) జరగనుంది. పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (Makineni Basavapunnaya Science Centre)లో ఈ సదస్సు జరగనుంది. బార్ కౌన్సిల్ (Bar Council) సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్, ముప్పాళ్ళ సుబ్బారావు కన్వీనర్లుగా సదస్సు జరగనుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu)ను అడ్డగించడం, పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ (Lokesh)కు ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై కూడా నేతలు చర్చించనున్నారు. కాగా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 1పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

రోడ్‌ షోలు (Road Show), ర్యాలీలు (Rallies) సభలకు (meetings)) అనుమతి నిరాకరిస్తూ జగన్‌ ప్రభుత్వం (Jagan Govt.) అప్రజాస్వామికంగా తీసుకువచ్చిన జీవో-1ను వ్యతిరేకిస్తూ ఐక్య పోరాటం చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు (సీపీఐ (CPI), సీపీఎం (CPM) నిర్ణయించాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన బస్సు యాత్రకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇటీవల విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రెండు పార్టీల ఉమ్మడి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆ పార్టీ నేతలు జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతోపాటు ఆ పార్టీ నేతలు వై.వెంకటేశ్వరరావు, సీహెచ్‌.బాబూరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగన్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Updated Date - 2023-02-19T10:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising