ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటికి అల్లాడుతున్నాం..

ABN, First Publish Date - 2023-03-25T01:00:34+05:30

తాగునీరు లేక అల్లాడిపోతున్నా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు గానీ తమ గోడు పట్టించుకోవటం లేదంటూ మండలంలోని వెంట్రప్రగడ గ్రామ శివారు లక్ష్మీపురంలో శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

లక్ష్మీపురం మహిళల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెదపారుపూడి, మార్చి 24 : తాగునీరు లేక అల్లాడిపోతున్నా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు గానీ తమ గోడు పట్టించుకోవటం లేదంటూ మండలంలోని వెంట్రప్రగడ గ్రామ శివారు లక్ష్మీపురంలో శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, గత పది రోజుల నుంచి తాగునీరు లేక అల్లాడిపోతున్నా ఎవరు పట్టించుకోవటం లేదన్నారు. ప్రతీ రోజు పంచాయతీ కార్యాలయంలో తాగునీటి సమస్యపై చెప్పినా స్పందన కరువైందన్నారు. మూడు కిలోమీటర్ల వెంట్రప్రగడ గ్రామంలోకి వచ్చి మినరల్‌ వాటర్‌ కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం మీ గ్రామానికి అది చేస్తాం, ఇది చేస్తాం ఏ సమస్యలు లేకుండా చూస్తామంటూ హామీలు ఇచ్చి ఓట్లు దండుకుంటున్నారని గెలిచిన తర్వాత ఏ ఒక్కరూ తమ మొహం చూడటం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు తమ తాగునీటి సమస్యలు పరిష్కరించాలని మహిళలు కోరుతున్నారు.

Updated Date - 2023-03-25T01:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising