Vijayawada: దుర్గగుడి ఏఈవో బూతుపురాణం
ABN, First Publish Date - 2023-03-24T11:41:14+05:30
విజయవాడ: బెజవాడ దుర్గగుడి ఏఈవో చంద్రశేఖర్ (AEO Chandrasekhar) బూతుపురాణం విప్పారు. పవిత్రమైన అమ్మవారి ఆలయంలో సిబ్బందిని తిడుతూ విరుచుకుపడ్డారు.
విజయవాడ: బెజవాడ దుర్గగుడి ఏఈవో చంద్రశేఖర్ (AEO Chandrasekhar) బూతుపురాణం విప్పారు. పవిత్రమైన అమ్మవారి ఆలయంలో సిబ్బందిని తిడుతూ విరుచుకుపడ్డారు. చెప్పుల స్టాండ్ మార్చిన సందర్భంగా కొంతమంది ఉద్యోగులు ఖాళీగా కూర్చున్నారు. దాంతో వారిని ఏఈవో ప్రశ్నించారు. కంప్యూటర్ (Computer) లేదని సిబ్బంది చెప్పారు. కంప్యూటర్ లేకపోతే పనిచేయరా? అంటూ మండిపడ్డారు. ఆలయంలో బూతులు మాట్లాడడంపై భక్తులు (Devotees) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవిత్రమైన ఇంద్రకీలాద్రి ఆలయంలో నిత్యం ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటోంది. అలాగే ఇవాళ సరికొత్త వివాదం చోటు చేసుకుంది. ఏఈవో చంద్రశేఖర్ బూతులతో రెచ్చిపోయారు. తన కింద పని చేస్తున్న సిబ్బందిపై ఈ విధంగా రెచ్చిపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పవిత్రమైన దేవాలయం సన్నిధిలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయారని, భక్తుల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు అంటున్నారు.
చెప్పుల స్టాండ్‌లో కంప్యూటర్ లేదని సిబ్బంది ఏఈవోకు తెలియజేశారు. దీంతో చంద్రశేఖర్‌కు ఎక్కడలేని కోపం వచ్చింది. అసభ్యపదజాలంతో రాయలేని విధంగా బూతులు ఉపయోగిస్తూ సిబ్బందిపై రెచ్చిపోయారు. దీంతో అక్కడ భుక్తులు షాక్ అయ్యారు. ఈ క్రమంలో కింద టోల్ గేట్ వద్ద ఓ వ్యక్తి అలసటతో కుర్చీలో కూర్చున్నాడు. దీంతో ఆ వ్యక్తిని ఎందుకు కూర్చోబట్టారని ఏఈవో టోల్ గేట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-03-24T11:41:14+05:30 IST