ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తినేస్తున్నారు!

ABN, First Publish Date - 2023-07-15T01:22:49+05:30

జడ్పీస్థాయిని దిగజార్చుతున్నారు.. జెడ్పీ ఏర్పడినప్పటి నుంచి ఫలహారాలు, భోజనాలు, ఆయిల్‌ ఖర్చులు తప్పితే మరొకటి లేకుండా పోతోంది. త్వరలో నిర్వహించబోయే సమావేశానికి సంబంధించి ఫలహారాలు, భోజనాలు, ఆయిల్‌ ఖర్చుల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లోనే అత్యధిక కేటాయింపులు చేసిన వాటిలో రిఫ్రె్‌షమెంట్స్‌ ఒకటి. బడ్జెట్‌ భారీగా కేటాయించాం కాబట్టి.. ఆ స్థాయిలో ఖర్చు చే యకపోతే బాగుంటుందా? డ్రై ఫ్రూట్స్‌, ఫ్రూట్స్‌, స్నాక్స్‌, ఫ్రూట్స్‌, జ్యూస్‌లు, భోజనాలు, బిర్యానీలు, వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాల ఆరగించటమే సరిపోతోంది. జెడ్పీనా.. మజాకానా అన్నట్టుంది వరస!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిఫ్రె్‌షమెంట్‌.. ఇం’ధనం’

జెడ్పీ స్థాయిని దిగజార్చేస్తున్నారు

అభివృద్ధి పనుల ఊసులేదు

ఫలహారాలు, ఆయిల్‌ ఖర్చుల కోసం సమీక్షా సమావేశాలా ?

చిల్లర ఖర్చుల ఆమోదానికి ప్రతిపాదనలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనుల సంగతి దేవుడెరుగు.. జడీ ్స నిధులను కాస్తా ఫలహారాలు, వాహన ఇంధనాల కోసమే ఖర్చు పెట్టేస్తున్నారు. జడ్పీ సమావేశాలు అంటే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉండాలి. ఫలహారాలు, భోజనాలు, వాహనాల బిల్లుల ప్రతిపాదనలు తప్పితే ప్రజోపయోగ పనులు కనిపించటం లేదు. త్వరలో జరగబోయే సమావేశాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా ఆమోదించాల్సిన ప్రతిపాదనలు సిద్ధమౌతున్నాయి. వీటిలో కూడా ఫలహారాల బిల్లులే ఉంటున్నాయి. ఇలా ఫలహారాల కోసం ప్రతిపాదనలు పెట్టడం జడ్పీస్థాయికి తగినది కాదనే ఆలోచన కూడా లేదు. ఫలహారాలు, భోజనాల పేరుతో ఎడాపెడా ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో ఒక్క ఫలహారాల కోసమే రూ.15 లక్షలు కేటాయించారు. జెడ్పీ కొలువుదీరినప్పటి నుంచి తిండి గొడవ తప్పితే మరొకటి లేకుండా పోతోంది. జడ్పీ సమావేశాలు అంటే ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగే అభివృద్ధి పనులపై ఇరు జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ప్రజా ప్రతినిథులు, జడ్పీటీసీల సమక్షంలో జరుగుతుంది. వివిధ శాఖల లక్ష్యాలు, సాఽధించిన ప్రగతిపై సమీక్ష చేయాల్సి ఉంటుంది. శాఖల పరిధిలో అభివృద్ధి పనులపైనా సమీక్ష ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలపైనా మదింపు ఉంటుంది. చివరగా జెడ్పీ ప్రతిపాదనలపై చర్చ జరగాల్సి ఉంటుంది. అయితే ప్రతిపాదనలు చర్చించుకునే స్థాయిలోనే ఉండటం లేదు. ఎక్కువుగా ఫలహారాలు, భోజనాల ఖర్చులు, వాహనాల ఆయిల్‌ బిల్లులు, మరమ్మతులు వంటివే ఉంటున్నాయి. ఇవి సమావేశంలో చదవటానికి కూడా అధికారులకు ఇబ్బందిగా ఉంటోంది. వీటిపై చర్చించటానికి కలెక్టర్లు, మంత్రులు, ప్రజా ప్రతినిథులు కూడా సిగ్గు పడే పరిస్థితి నెలకొంది. చేయాలనుకున్నవి చేసేసి, ఖర్చు పెట్టాల్సినవి పెట్టేసి తర్వాత వాటి ర్యాటిఫికేషన్‌ కోసమే జెడ్పీ సమావేశాల సందర్భంగా ప్రతిపాదనలుగా చేర్చుతున్నారు. ఎందుకంటే ఖర్చుకు మళ్లీ జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు.

జెడ్పీ పరిమితి.. పెడుతున్న ఖర్చు

జెడ్పీ నిబంధనల ప్రకారం ఫలహారాలు, భోజనాలు, వాహనాల ఆయిల్‌, మరమ్మతులు తదితరాలకు సంబంధించి పరిమితి ఉంటుంది. అది దాటి ఖర్చు చేయటం ఒక ఎత్తు అయితే.. ఖర్చు చేసిన వాటికి ర్యాటిఫికేషన్‌ చేయటం మరొక ఎత్తు. ర్యాటిఫికేషన్‌ ప్రతిపాదనలే కాబట్టి జెడ్పీ సమావేశంలో వెంటనే ఆమోదమౌతున్నాయి. ప్రతిసారీ తిండి ఖర్చులు, ఆయిల్‌ బిల్లులకు సంబంధించి ప్రతిపాదనలు వస్తున్నపుడు కలెక్టర్లు, మంత్రులు ఆరా తీస్తే వ్యవహారాలు బయట పడతాయి. అలా జరగకపోవటంతోనే ఇష్టారాజ్యమైపోతోంది.

తాజా ప్రతిపాదనలు..

త్వరలో జరిగే జెడ్పీ సమావేశానికి సిద్ధం చేస్తున్న ప్రతిపాదనలను పరిశీలిస్తే.. ఇటీవల కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సర్వసభ్య సమావేశానికి సంబంధించి రిఫ్రె్‌షమెంట్‌, భోజనాల ఖర్చు రూ.1,56,857, కలెక్టర్‌, ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రిఫ్రె్‌షమెంట్స్‌కు చేసిన ఖర్చు రూ.4,055, వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా హాజరైన అధికారులకు రిఫ్రె్‌షమెంట్‌ ఏర్పాటుకు రూ.7,270లు ఖర్చయిందట.. దీనికి గాను చేసిన ఖర్చుకు సంబంధించి ర్యాటిఫై చేయాల్సిందిగా పెట్టారు. మార్చి 29న జెడ్పీ కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘం సమావేశానికి రిఫ్రె్‌షమెంట్స్‌, భోజనాల కోసం రూ.62,876లు ఖర్చయ్యాయట! దీనికి సంబంధించి చేసిన ఖర్చును ర్యాటిఫై చేయాల్సిందిగా ప్రతిపాదన పెట్టారు. స్థాయీ సంఘ సమావేశాలకు కూడా ఇంత భారీస్థాయిలో ఫలహారాలు, భోజనాలకు ఖర్చు చేయటం అర్థం కాకుండా ఉంది. జెడ్పీ కార్యాలయ వాహనాలు ఏపీ16డీఎన్‌3726, ఏపీ16డీఎన్‌2690లకు మార్చి నెలలో ఇంథనం సరఫరా చేసిన నిమిత్తం రూ.1,07,803లు చెల్లించినందున ర్యాటిఫై కోరుతూ ప్రతిపాదించారు. ఇవే వాహనాలకు ఏప్రిల్‌ నెలలో చెల్లించిన రూ.1,12,159, ఆ తర్వాత వాహనాల మరమ్మతుల పేరుతో రూ.3670, రూ.2200, రూ, 1470ల ఖర్చు ప్రతిపాదనలు, ఆ తర్వాత ఎలక్ర్టిసిటీ బిల్లుల చెల్లింపునకు సంబంధించి మరో రూ. 55,824ల ప్రతిపాదనలు పెట్టారు. ఇలా జెడ్పీ ప్రతిపాదలన్నీ భోజన, వాహనాల ఇంథనాలు, విద్యుత్‌ వంటి ఖర్చుల ప్రతిపాదనలు తప్పితే మరొకటి లేకుండా పోయింది. దీనిని బట్టి ప్రజలే అర్ధం చేసుకోవాలి.

Updated Date - 2023-07-15T01:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising