వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం
ABN, First Publish Date - 2023-11-20T01:08:17+05:30
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలోని ఉపాలయం వల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయంలో ప్రతి నెలా షష్టి రోజు నిర్వహించే స్వామి కల్యాణం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహిం చారు.
వన్‌టౌన్, నవంబరు 19: దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలోని ఉపాలయం వల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయంలో ప్రతి నెలా షష్టి రోజు నిర్వహించే స్వామి కల్యాణం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహిం చారు. అర్చక స్వాములు ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలందించారు. అనంతరం కల్యాణం నిర్వహించారు.
ప్రత్యేక పూజలు
దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు సూర్యోపాసన సేవ, నిత్య ఆర్జిత సేవలైన లక్ష కుంకుమార్చన, అమ్మవారి ఖడ్గమా లార్చన, శ్రీచక్ర నవవార ణార్చన, చండీహోమం, శాంతి కల్యాణం, ఇతర వైదిక కార్య క్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో సహస్ర లింగార్చన, బిల్వార్చన, మంత్రపుష్పం, రుద్రాభి షేకం తదితర వైదిక కార్యక్రమాలను అర్చకులు ప్రత్యేకంగా నిర్వహించారు.
Updated Date - 2023-11-20T01:08:19+05:30 IST