ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గురజాడ కీర్తి నేటి తరానికి స్ఫూర్తి

ABN, First Publish Date - 2023-09-22T01:37:35+05:30

సామాజిక రుగ్మతలను రూపుమాపి సాంఘిక పరివర్తనకు అహర్నిశలు కృషి చేసిన మహాకవి గురుజాడ అప్పారావు నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. దిల్లీరావు అన్నారు.

2కే రన్‌ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌ దిల్లీరావు, తదితరులు

కలెక్టరేట్‌, సెప్టెంబరు 21 : సామాజిక రుగ్మతలను రూపుమాపి సాంఘిక పరివర్తనకు అహర్నిశలు కృషి చేసిన మహాకవి గురుజాడ అప్పారావు నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. దిల్లీరావు అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు 161వ జయంతిని పురస్కరించుకుని గురువారం జాషువా సాంస్కృతిక వేదిక, ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌, జిఆర్‌కె పోలవరపు కళాసమితి, సేఫ్‌ సంస్థ, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌ ర్యాలీని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సాంఘిక రుగ్మతలు రూపుమాపేందుకు గురజాడ అప్పారావు చేసిన కృషి మరవలేనిదన్నారు. సామాజిక మార్పుకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు రచనలు సాంఘిక పరివర్తనకు దోహదపడ్డాయన్నారు. 1920 శతాబ్దంలో గురజాడ రచనలు నేటికీ ప్రజల మన్నలను పొందుతున్నాయన్నారు. సామాన్యుడికి కూడా అర్ధమయ్యే రీతిలో వాడుక భాషతో తనదైన శైలిలో రచించిన మహాకావ్యం కన్యాశుల్కం, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ లాంటి వాటిలో సమాజాన్ని మోసంచేసే గిరీశం లాంటి పాత్రలతో, బాల్య వివాహాల దురాచారాలను ఎండగట్టారని అన్నారు. 130 సంవత్సరాల నాడు నాటి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలపై గొప్ప రచనలు చేశారన్నారు. నేటి సమాజంలో అటువంటి గిరీశాల సంఖ్య పెరగడం ఆందోళనకర అంశమని పేర్కొన్నారు. తెలుగుభాష అభివృద్ధికి విశేష కృషి చేసారని తెలిపారు. ఈనాటి బాలలకు పాఠశాలల్లో గురజాడ రచనలపై చర్చా వేదికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశమును ప్రేమించుమన్న.. మంచి అన్నది పెంచుమన్న.. అన్న గేయం నేటితరాన్ని ఉత్తేజపరుస్తుందన్నారు. దేశమును ప్రేమించుమన్న గేయాన్ని ర్యాలీలో పాల్గొన్న విద్యార్ధులందరితో కలిసి ఆలపించిన అనంతరం కలెక్టర్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సుమారు వేయిమంది విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బయలుదేరి రెడ్‌ సర్కిల్‌, కస్తూరిబాయిపేట గాంధీ బొమ్మలు, మధు గార్డెన్స్‌, శిఖామణి సెంటర్‌ మీదుగా తిరిగి ఫుడ్‌ కోర్టుకు చేరుకుంది. ర్యాలీలో మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌, ప్రముఖ విద్యావేత్త ఎస్‌ఆర్‌. పరిమి, వాసవ్య మహిళామండలి అధ్యక్షురాలు జి.రష్మి, అమరావతి బాలోత్సవం గౌరవాధ్యక్షులు చలవాది మల్లికార్జునరావు, అక్వా డెవిల్స్‌ అధ్యక్షుడు వెలగపూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T01:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising