ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామ పంచాయతీ కార్మికులపై వేధింపులు ఆపాలి

ABN, First Publish Date - 2023-03-02T00:59:00+05:30

గ్రామ పంచాయతీ కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపి, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.వెంకట్రామయ్య, ఉమామహేశ్వరరావు కోరారు.

పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేస్తున్న యూనియన్‌ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గవర్నర్‌పేట, మార్చి 1: గ్రామ పంచాయతీ కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపి, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.వెంకట్రామయ్య, ఉమామహేశ్వరరావు కోరారు. బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌కు వారు వినతిపత్రం అందించారు. గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్ల సమస్యలపై చర్చించారు. జీవో 57, 132, 680 అమలు చేయించాలని, టెండర్లతో సంబంధం లేకుండా కార్మికులను ఉద్యోగాల్లో కొనసాగించాలని, గ్రీన్‌ అంబాసిడర్లకు బకాయి జీతాల చెల్లింపుతో పాటు ఉద్యోగభద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈసీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించి, తొలగించిన వారిని వెంటనే విధు ల్లోకి తీసుకోవాలని కోరారు. అనేక పంచాయతీల్లో 6 నుంచి 10 నెలల బకాయి వేతనాలు చెల్లించాల్సి ఉందని, వెంటనే ఇప్పించాలని కోరారు. సమస్యలు పరిశీలించి కార్మికులందరికీ న్యాయం జరిగేలా చూ స్తానని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజ శేఖర్‌ హామీ ఇచ్చారు. యూనియన్‌ బృందంలో నేతలు జి.రామాంజనే యులు, వి.రాము, జి.నాగేశ్వరరావు, ఎం.నాగన్న, కె.శ్రీనివాసరావు, ఎన్‌. సురేంద్రబాబు ఉన్నారు.

Updated Date - 2023-03-02T00:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!